Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కృష్ణగాడివీరప్రేమగాథ ఒకవైపు గరం మరోవైపు: నాని VS ఆది.. ఎవరిది గెలుపు?

కృష్ణగాడివీరప్రేమగాథ ఒకవైపు గరం మరోవైపు: నాని VS ఆది.. ఎవరిది గెలుపు?
, శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (14:21 IST)
ఒకపక్క కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన హీరో మరోపక్క కెరీర్ మొదట్లో రెండు హిట్లు కొట్టి తరువాత హిట్లు లేక కొంతకాలం టాలీవుడ్‌కి దూరమైన మరోహీరో. ఈ ఇద్దరు హీరోలు ఈ శుక్రవారం బాక్స్ ఆఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరిక్షి౦చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇద్దరిలో విజయం ఎవరిని వరిస్తుందోనని అందరూ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. 
 
ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు నాని-ఆది, ఈ ఇద్దరు నటించిన సినిమాలు కృష్ణగాడివీరప్రేమగాథ, గరం సినిమాలు. శుక్రవారం రిలీజ్ అయ్యాయి. లో బడ్జెట్ హీరో స్థాయి నుంచి స్టార్ రేంజ్‌కి ఒకేసారి వెళ్లిపోయిన నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాథ ఒకటైతే.. డైలాగ్ కింగ్ సాయికుమార్ కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్న ఆది నటించిన గరం మూవీ మరొకటి. నాని గత సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో కాస్త ఎక్కువే ఖర్చు చేశారు. అలాగే సొంత సినిమా అవడంతో.. ప్రెస్టీజియస్‌గా తీసుకుని ఆది కోసం కూడా బాగానే వెచ్చించారు. 
 
నాని భలే భలే మొగాడివోయ్ బ్లాక్ బస్టర్ తరువాత సూపర్ కాన్ఫిడెంట్‌గా కృష్ణగాడివీరప్రేమగాథ సినిమాతో భారీగా రిలీజ్ అవ్వడానికి వస్తుంటే ఆది మాత్రం ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్‌గా రాబోతున్నాడు. కానీ ఇద్దరిలో ప్రేక్షకులమొగ్గు నాని వైపే ఉండగా ఆది సినిమాకు కూడా కొద్దోగొప్పో ప్రచారం అయితే జరుగుతుంది. 
 
ఆదా శర్మ అదే పనిగా సినిమాను అన్నిచోట్ల ప్రమోట్ చేస్తూ వస్తుండగా ఆది కూడా తనదైన రీతిలో ప్రమోషన్ చేస్తున్నాడు. నాని మాత్రం తన సినిమా కంటెంట్‌ని నమ్ముకుని మరోసారి రికార్డులు బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్నాడు. మరి నాని సినిమా ఎఫెక్ట్‌కు ఆది ఏమౌతాడో తెలియాలంటే వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu