Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బోల్తా కొట్టిన హీరో బాలకృష్ణ కారు.. ఎయిర్ బెలూన్స్‌తో డ్రైవర్ సురక్షితం.. మరి బాలయ్య?

నందమూరి నటసింహం, టాలీవుడ్ ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కారు ప్ర‌మాదానికి గురైంది. కొద్ది రోజుల క్రితం ఆయ‌న హిందూపురంలో ప‌ర్య‌టిస్తుండ‌గా.. ఆయ‌న కారు ప్ర‌మాదానికి గురైంది.

బోల్తా కొట్టిన హీరో బాలకృష్ణ కారు.. ఎయిర్ బెలూన్స్‌తో డ్రైవర్ సురక్షితం.. మరి బాలయ్య?
, బుధవారం, 31 ఆగస్టు 2016 (10:37 IST)
నందమూరి నటసింహం, టాలీవుడ్ ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కారు ప్ర‌మాదానికి గురైంది. కొద్ది రోజుల క్రితం ఆయ‌న హిందూపురంలో ప‌ర్య‌టిస్తుండ‌గా.. ఆయ‌న కారు ప్ర‌మాదానికి గురైంది. అప్పుడు కూడా ఆయ‌న సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డి... తన అనుచరుల సహాయంతో మరో కారులో బెంగళూరు వెళ్లిపోయారు. యాక్సిడెంట్ అయిన మాట వాస్తవమే కానీ తనకు ఏమీ అవ్వలేదని నందమూరి బాలకృష్ణ తెలిపిన సంగతి తెలిసిందే. 
 
కాగా మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో బసవతారక కేన్సర్ ఆసుపత్రి ముందు ఫార్చునర్ కారు(AP 02 AY 0001) అదుపుతప్పి రోడ్డు పక్కన గల కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో డ్రైవర్ సురక్షితంగా బతికి బయటపడ్డారు. అయితే కారు ప్రమాదం జరిగిన సమయంలో బాలకృష్ణ అందులో లేకపోవడంతో నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అర్థరాత్రి సమయం కావడం వల్ల జనసంచారం లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని అధికారులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విక్రమ్ - నయనతారల 'ఇంకొక్కడు' సెన్సార్ పూర్తి.. 8న విడుదల