Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వర్షాలతో ఇబ్బందులు.. హన్సిక వర్షంలో అలా రోడ్డుపై నడుస్తుంటే.. ఎవ్వరూ..!?

వర్షాలతో ఇబ్బందులు.. హన్సిక వర్షంలో అలా రోడ్డుపై నడుస్తుంటే.. ఎవ్వరూ..!?
, గురువారం, 26 నవంబరు 2015 (13:45 IST)
వర్షాల వల్ల సామాన్యుల కష్టాలు అన్నీ ఇన్నీకావు. క్రికెట్‌ మ్యాచ్‌లకూ, షూటింగ్‌‌లకు ఇబ్బందే. గతంలో ముంబైలో కురిసిన భారీ వర్షాలకు బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ చాలా నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పుడు తమిళ పరిశ్రమ అదేకోవలోకి చేరింది. గత కొద్దిరోజులుగా తుఫాను కారణంగా వర్షాలు వరదలను తెచ్చాయి. చెన్నైలో ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. చుట్టుప్రక్కల ప్రాంతాల పరిస్థితి దయనీయంగా వుంది. దాంతో పలు సినిమాల షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. 
 
కాగా, నటి హన్సిక ఓ సినిమా నిమిత్తం సోమవారం రాత్రి ముంబై నుంచి చెన్నైకు చేరుకుంది. అప్పటికే జోరున వర్షం కురుస్తుంది. తను బస చేసే హోటల్‌కు వెళ్ళింది. కానీ.. వర్షం కారణంగా హోటల్‌కు అరకిలోమీటర్‌ దూరంలో ట్రాఫిక్‌లో ఇరుక్కుంది. చాలా సేపటికి సాధ్యపడకపోవడంతో కారు దిగి నడిచి వర్షంలో తడుస్తూనే హోటల్‌కు చేరుకుంది. ఈ సమయంలో ప్రజలు ఎవరి గొడవలో వారు వుండడంతో ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదని ట్విట్టర్‌లో పెట్టింది.

Share this Story:

Follow Webdunia telugu