Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిరంజీవి బహిరంగ ఆఫర్.. ఎవరైనా రావొచ్చు... క్యూలో యంగ్ డైరక్టర్స్!

చిరంజీవి బహిరంగ ఆఫర్.. ఎవరైనా రావొచ్చు... క్యూలో యంగ్ డైరక్టర్స్!
, మంగళవారం, 25 ఆగస్టు 2015 (11:22 IST)
మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై మళ్లీ కనిపించేందుకు తహతహలాడిపోతున్నారు. ఇందుకోసం గత యేడాది కాలంగా నిరీక్షిస్తున్నారు. అయినప్పటికీ.. ఆయనను సంతృప్తి పరిచేలా ఏ ఒక్క దర్శకుడు కూడా సంతృప్తికరమైన కథను అందించలేక పోయారు. దీంతో చిరంజీవి ఇపుడు బహిరంగ ఆఫర్‌ను ప్రకటించారు. ఇపుడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు నేను తయారుగా ఉన్నా... మీరు మంచి కథతో తయారై రండి... నాకు ఎవరైనా ఓకే అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేశాడు.
 
 
కథ అద్భుతంగా ఉంటే వంశీ పైడిపల్లి, వివి వినాయక్, హరీశ్ శంకర్, పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్, ఇలా ఏ దర్శకుడైనా తనకు ఓకే అంటూ ప్రకటించారు. మెగా ఆఫర్‌పై యంగ్ డైరెక్టర్స్‌లో ఆశలు రేపింది. అందరూ కథలపై కసరత్తు చేస్తున్నారు. ఆ దర్శకుడూ.. ఈ దర్శకుడు... పెద్దా చిన్నా అనే తేడా లేకుండా అందరూ చిరు 150వ సినిమా కోసం తెగ కష్టపడుతున్నారు. మెగా ఆఫర్ కోసం... పెన్ను తిరిగిన రచయితలంతా రేయింబవళ్లూ తమ బుర్రలకు పదును పెడుతున్నారు.
 
నిజానికీ ఒక సినిమా కోసం మెగా ఫ్యామిలీని ఒప్పించడం అంతసులభం కాదు. నెల పట్టొచ్చు.. యేడాది పట్టొచ్చు.. పైగా వీళ్లు పట్టుకెళ్లిన కథ దర్శకులు, రచయిలకే గుర్తు రానంతంగా మారిపోనూవచ్చు. కాస్త టాలెంట్ ఉండి, మంచి లైన్ ఉండి మెగా కాంపౌండ్‌లోకి అడుగుపెడితే వెంటనే గ్రీన్‌సిగ్నల్ రావొచ్చు... అడ్వాన్స్ కూడా ఇవ్వొచ్చు.... కానీ అసలు కథ. ఇటు మార్చడం.. అటు మార్చడం.. ఇక్కడ చేర్చడం. అక్కడ చేర్చడం. అలా ఆ కథ నడుస్తూనే ఉంటుంది.... అందుకే ఏళ్లు గడుస్తున్నా చిరును మెప్పించే స్టోరీ రెడీ కాలేదు... అభిమానుల ఆశా తీరడం లేదు.. అలరించాలి.... అనందపరచాలి... అందర్నీ సంతృప్తి పరచాలి.. ఇదీ మెగాస్టార్ చిరంజీవి నోటి నుంచి వస్తున్న మాట. 

Share this Story:

Follow Webdunia telugu