Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

Advertiesment
kajol

ఠాగూర్

, గురువారం, 13 నవంబరు 2025 (13:41 IST)
బాలీవుడ్ నటి కాజోల్ పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. పెళ్ళికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందన్నారు. అలాగే, రెన్యువల్ ఆప్షన్ కూడా ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పలువురు సినీ ప్రముఖులను ఆశ్చర్యానికి గురిచేశాయి. గత రెండున్నదశాబ్దాలకు పైగా వైవాహిక జీవితాన్ని గడుపుతున్న కాజల్ అగర్వాల్ ఇపుడు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. 
 
బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నాతో కలిసి కాజోల్ కలిసి నిర్వహిస్తున్న 'టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్' అనే సెలబ్రిటీ టాక్ షో తాజా ఎపిసోడ్‌కు నటులు విక్కీ కౌశల్, కృతి సనన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్వింకిల్ ఖన్నా 'వివాహానికి గడువు తేదీ, రెన్యువల్ ఆప్షన్ ఉండాలా?' అని ప్రశ్నించారు. దీనికి విక్కీ, కృతి, ట్వింకిల్ 'వద్దు' అని చెబుతూ రెడ్ జోనులో నిలబడగా, కాజోల్ మాత్రం 'అవును' అంటూ గ్రీన్ జోనులోకి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు.
 
వెంటనే ట్వింకిల్ ఖన్నా సరదాగా 'అది పెళ్లి.. వాషింగ్ మెషీన్ కాదు కదా!' అని చమత్కరించారు. దీనికి కాజోల్ బదులిస్తూ, 'నేను నిజంగానే అలా అనుకుంటున్నాను. మనం సరైన సమయంలో సరైన వ్యక్తినే పెళ్లి చేసుకుంటామని ఎవరు హామీ ఇస్తారు? గడువు ఉంటే ఎక్కువ కాలం బాధపడాల్సిన అవసరం ఉండదు. అలాగే, రెన్యువల్ ఆప్షన్ ఉంటే ఆ బంధానికి కొత్త అర్థం వస్తుంది' అని తన అభిప్రాయాన్ని స్పష్టంగా వివరించారు.
 
అదే షోలో 'డబ్బుతో ఆనందాన్ని కొనుగోలు చేయవచ్చా?' అనే మరో ప్రశ్న రాగా... కాజోల్ 'లేదు' అని సమాధానమిచ్చారు. 'డబ్బు ఎక్కువగా ఉండటం వల్ల కొన్నిసార్లు నిజమైన సంతోషాన్ని అర్థం చేసుకునే అవకాశం కూడా కోల్పోతాం' అని ఆమె పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్