Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జడ్జ్ పాత్రలో మంచులక్ష్మీ.. పవర్ ఫుల్ రోల్ కోసం కసరత్తులు

వసూల్ రాజా, సాధ్యం వంటి సినిమాలను తెరకెక్కించిన కార్తికేయ గోపాలకృష్ణ స్క్రిప్ట్ నచ్చడంతో మంచు లక్ష్మి... న్యాయమూర్తి పాత్రలో కనిపించేందుకు అంగీకారం తెలిపింది. జడ్జ్ పాత్రలో కనిపించేందుకు మంచులక్ష్మీ బ

జడ్జ్ పాత్రలో మంచులక్ష్మీ.. పవర్ ఫుల్ రోల్ కోసం కసరత్తులు
, మంగళవారం, 14 జూన్ 2016 (15:53 IST)
వసూల్ రాజా, సాధ్యం వంటి సినిమాలను తెరకెక్కించిన కార్తికేయ గోపాలకృష్ణ స్క్రిప్ట్ నచ్చడంతో మంచు లక్ష్మి... న్యాయమూర్తి పాత్రలో కనిపించేందుకు అంగీకారం తెలిపింది. జడ్జ్ పాత్రలో కనిపించేందుకు మంచులక్ష్మీ బాగా కసరత్తు చేస్తోంది. 
 
న్యాయం కోసం పోరాడే ఓ పవర్ ఫుల్ రోల్ కావడంతో ఆ రోల్ కోసం ఆమె చాలా కష్టపడిపోతోంది. ముఖ్యంగా లుక్ విషయంలోను.. బాడీ లాంగ్వేజ్ విషయంలోనూ.. నిజమైన జడ్జిల మాదిరిగా నటన ఉండాలని భావిస్తోంది. అందుకే లాయర్లను సంప్రదించి.. వారి సలహాలను.. వారి బాడీ లాంగ్వేజ్‌ను గమనిస్తోంది.
 
ఒక రోల్ కోసం మంచు లక్ష్మి తీసుకుంటున్న చర్యల్ని బట్టి చూస్తే ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. కానీ ఈ రోల్ ద్వారా తన కెరీర్‌కు మంచి గుర్తింపు లభిస్తుందని సినీ పండితులు అంటున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా త్వరలో షూటింగ్‌ను పూర్తి చేసుకోనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెంకటేష్ బాబు బంగారం.. రూ.కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్