Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మల్లికా‍కు సుప్రీంకోర్టు ఆదేశాలు: లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలి

మల్లికా‍కు సుప్రీంకోర్టు ఆదేశాలు: లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలి
, సోమవారం, 6 జులై 2015 (16:34 IST)
బాలీవుడ్ గ్లామర్ తార మల్లికా షెరవత్‌కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లోపు లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
బాలీవుడ్ సినిమా డర్టీ పాలిటిక్స్ పోస్టర్లలో మల్లికా షెరావత్ జాతీయ జెండాను ఒంటి నిండా చీరలా కప్పుకుని జాతీయ పతాకాన్ని అగౌరవపరిచిందని సుప్రీం కోర్టులో న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. 
 
దీనిని విచారించిన న్యాయస్థానం లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా మల్లికా షెరావత్ డర్టీ పాలిటిక్స్ పోస్టర్లో జాతీయ జెండాను అగౌరవపరచడంపై పలు చోట్ల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu