Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'బాహుబలి' ఫీవర్ నుంచి ఆ సినిమా తిప్పేసిందా... పార్టీ ఇచ్చిన ప్రిన్స్...

'బాహుబలి' ఫీవర్ నుంచి ఆ సినిమా తిప్పేసిందా... పార్టీ ఇచ్చిన ప్రిన్స్...
, బుధవారం, 9 సెప్టెంబరు 2015 (14:16 IST)
సినిమా పూర్తయ్యాక, విడుదల తర్వాత ఆనందంతో చిత్ర హీరోలు ఆ చిత్రానికి పనిచేసిన యూనిట్‌కు మంచి పార్టీ ఇవ్వడం ఆనవాయితీ. తాజాగా మహేష్‌ బాబు అలాంటి పార్టీయే ఇచ్చాడు. శ్రీమంతుడు చిత్రం అందరికీ కనెక్ట్‌ కావడం.. సరిగ్గా తెలంగాణలో చెరువులను బాగుచేయడం.. ఊరిని దత్తత తీసుకోవడం వంటి కాన్పెప్ట్‌లు నడుస్తున్న టైంలో ఆ సినిమా విడుదల కావడంతో ఆ సినిమాకు కలిసివచ్చింది. పైగా మహేష్‌ అందంగా కన్పించాడు.
 
ఇదిలావుండగా.. ఈ సినిమాకు పనిచేసిన యూనిట్‌కు మహేష్‌ తన ఫామ్‌హౌస్‌లో పార్టీ ఇచ్చాడు. సహజంగా ఇలాంటి వాటికి దూరంగా వుండే ఆయన... చాలా బ్యాలెన్స్‌గా అందరికీ పార్టీ ఇచ్చి, రెండు మాటలు మాట్లాడాలంటే.. తను ఇలా మాట్లాడినట్లు తెలిసింది. హీరో ఇమేజ్‌ను పెంచడమే కాకుండా.. నాకు తృప్తినిచ్చిన సినిమా ఇది.
 
ముఖ్యంగా బాహుబలి ఫీవర్‌ నుంచి ప్రేక్షకుల్ని తిప్పుకునేందుకు ఈ సినిమా వుపయోగపడిందని చాలామంది అనడం నాకే ఆశ్చర్యమేసిందని వెల్లడించారు. పనిలోపనిగా.. దర్శకుడు కొరటాల శివకు ఖరీదైన గిఫ్ట్‌ కూడా ఇచ్చాడని తెలిసింది. మరోమంచి కథతో వస్తే మీకు డేట్స్‌ ఇస్తానని చెప్పడం కూడా విశేషం.

Share this Story:

Follow Webdunia telugu