Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గబ్బర్ సింగ్‌తో రొమాన్స్ చేయనున్న రాయ్ లక్ష్మీ.. కేక పుట్టిస్తుందా?

గబ్బర్ సింగ్‌తో రొమాన్స్ చేయనున్న రాయ్ లక్ష్మీ.. కేక పుట్టిస్తుందా?
, బుధవారం, 30 సెప్టెంబరు 2015 (17:38 IST)
కెవ్వు కేక అంటూ గబ్బర్ సింగ్‌లో కేక పుట్టించిన పవన్ కల్యాణ్.. సర్దార్ గబ్బర్ సింగ్‌లోనూ కేక పుట్టించేలా రాయ్ లక్ష్మీతో పవన్ రొమాన్స్ చేస్తారని సమాచారం. ఇప్పటికే సర్దార్ మూవీ షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయ్యింది. గబ్బర్ సింగ్‌లో ఐటమ్ సాంగ్  ‘కెవ్వు కేక’ ఒక్క ఊపు ఊపింది. ఈ పాటలో మల్లికా అరోరా నటించింది. 
 
ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కూడా ఓ హాట్ హాట్ ఐటెం సాంగ్ ఉందట. ఈ సాంగ్‌లో గ్లామర్ గర్ల్ లక్ష్మి రాయ్ నర్తిస్తుంది. ఇప్పటికే ఈ సాంగ్ కోసం సెట్టింగ్ కూడా రెడీ అయింది. 
 
దేవి శ్రీ ప్రసాద్ కంపోస్ చేసిన సాంగ్ బాగా వచ్చిందని ఈ నెల 30 నుండి ఈ సాంగ్‌ను పవన్ కల్యాణ్‌తో లక్ష్మీ రాయ్‌తో ఫిలిమ్ సిటీలో చిత్రీకరించనున్నారు. ఆ మధ్య బలుపు చిత్రంలో రవితేజ సరసన ఐటమ్ సాంగ్ చేసిన లక్ష్మీ రాయ్ ఇప్పుడు పవన్ సరసన ఐటమ్ సాంగ్ చేయనుంది. ఈ సాంగులో రాయ్ లక్ష్మీ, పవన్‌ల రొమాన్స్ అదిరిపోతుందట.

Share this Story:

Follow Webdunia telugu