Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియాంక చోప్రాపై కత్రీనా కామెంట్: 22 గంటల పాటు ప్రయాణం.. అదెలా..?

ప్రియాంక చోప్రాపై కత్రీనా కామెంట్: 22 గంటల పాటు ప్రయాణం.. అదెలా..?
, మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (17:02 IST)
బాలీవుడ్ నటీమణి ప్రియాంకా చోప్రా సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని కత్తిలాంటి హీరోయిన్ కత్రీనా కైఫ్ అంటోంది. ఫితూర్ సినిమా శుక్రవారం రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్‌లో కత్రినా కైఫ్ బిజీ బిజీగా ఉంది.

ఈ నేపథ్యంవో ప్రియాంక చోప్రా సక్సెస్ ఏంటో తెసుకోవాలని కత్రీనా ఆరాటపడింది. రోజు 22 గంటల పాటు విమానంలో ప్రయాణిస్తూ హాలీవుడ్‌లో ఎలా నటించగలుగుతుందో తెలుసుకోవాలని చోప్రా వ్యాఖ్యానించింది. 
 
హాలీవుడ్‌లో నటించాలంటే ఎంతో ధైర్యం, పట్టుదల, ఏకాగ్రత కావాలని, అవన్నీ తనలోనే ఉన్నాయని ప్రియాంక చోప్రా నిరూపించిందని కత్రినా కితాబిచ్చింది. దీనిమీద ప్రియాంక చోప్రా ఏకంగా ఓ పుస్తకం రాయాలని కత్రినా సూచించింది. ఇకపోతే.. ఫితూర్ సినిమాలో కత్రినా కైఫ్‌తో పాటు ఆదిత్యా రాయ్ కపూర్, తబు తదితరులు నటిస్తున్నారు. 
 
ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా కత్రినా మాట్లాడుతూ.. తనకు మొదటి ఫ్రెండ్ ఇండియన్ అబ్బాయేనని టీనేజ్ సంగతుల్ని గుర్తు తెచ్చుకుంది. ఇంకా రణ్‌బీర్ కపూర్‌తో బ్రేకప్‌, సల్మాన్ ఖాన్‌తో ప్రేమాయాణం మొదలెట్టిందంటూ వచ్చిన వార్తలపై అమ్మడు దాటవేసింది.

Share this Story:

Follow Webdunia telugu