Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్న బాటలో తమ్ముడు.. ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన ఊపిరి కార్తీ!

అన్న బాటలో తమ్ముడు.. ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన ఊపిరి కార్తీ!
, గురువారం, 26 మే 2016 (10:55 IST)
తమిళ నటుడు కార్తీ తన అన్న సూర్య బాటలో నడుస్తున్నాడు. ఇటీవలే సూర్య.. ట్విట్టర్‌ ఎకౌంట్‌ ఓపెన్‌ చేశాడు. అంతకుముందు ఫేస్‌ ఐడీతో ట్విట్టర్‌లో పలురకాలుగా రాయడంపై విమర్శలు రావడంతో అది తనదికాదని.. కొత్తగా అకౌంట్‌ ఓపెన్‌చేశాడు. ఇప్పుడు కార్తీకూడా ట్విట్టర్‌ ఓపెన్‌ చేశాడు. బుధవారంనాడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా చెన్నైలో అభిమానులసమక్షంలో జరుపుకున్నారు. 
 
అనంతరం.. ట్విట్టర్‌లో.. అభిమానులుద్దేశించి థ్యాంక్స్‌ చెప్పారు. Actor Karthi @Karthi_Offl  ద్వారా వారికి థ్యాంక్స్‌ చెబుతూ.. పుట్టినరోజునాడే తాను ట్విట్టర్‌లోకి రావడంపట్ల స్నేహితులు శుభాకాంక్షలు తెలుపుతూ.. పోస్ట్‌ చేశాడు. తమిళవాడైనా తెలుగువాడిగా కలిసిపోయేలా కన్పించే కార్తీ ప్రతి తమిళ చిత్రం తెలుగులో డబ్‌ అవుతూనే వుంటుంది. త్వరలో తెలుగులో ఓ చిత్రాన్ని చేస్తానని ప్రకటించాడు. ఇక కార్తీ ట్విట్టర్‌కు రావడం పట్ల తమ ఆనందాన్ని తెలుపుతూ అభిమానులు ట్వీట్స్‌తో స్వాగతం పలికారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూన్ మూడో వారంలో విడుదలకు సిద్ధమవుతున్న జీరో!