Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నటిని అవ్వాలనుకున్నా: కరీనా కపూర్ ఖాన్

కరీనా కపూర్ ఖాన్ తాను గర్భం దాల్చిన విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అయితే తన అభిమాన తార గర్భం ధరించాక సినిమాల్లో నటిస్తుందో లేదో అనే ప్రశ్నకు కూడా కరీనా కపూర్ స్పందించింది. తనకు 80 ఏళ్లు వచ్చేంతవర

నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నటిని అవ్వాలనుకున్నా: కరీనా కపూర్ ఖాన్
, బుధవారం, 24 ఆగస్టు 2016 (11:53 IST)
కరీనా కపూర్ ఖాన్ తాను గర్భం దాల్చిన విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అయితే తన అభిమాన తార గర్భం ధరించాక సినిమాల్లో నటిస్తుందో లేదో అనే ప్రశ్నకు కూడా కరీనా కపూర్ స్పందించింది. తనకు 80 ఏళ్లు వచ్చేంతవరకు నటిస్తూనే ఉంటానని చెప్పింది. సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ.. గర్భం దాల్చిన విషయాన్ని భర్తతో కలిసి ప్రకటించింది. 
 
కానీ గర్భం దాల్చినంత మాత్రానికే సినిమాలకు దూరంగా ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. తాను అందరిలాగానే సాధారణ మహిళలా తన పని చేసుకుంటానని.. అందులో ఏ తప్పు లేదని.. తాను తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే నటిని కావాలనుకున్నానని.. అందుకే తాను 80 ఏళ్లు వచ్చేంతవరకు నటిస్తూనే ఉంటానని కరీనా కపూర్ ఖాన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఎలాంటి పాత్ర వేసేందుకైనా రెడీ అని చెప్పింది. 
 
కానీ గర్భం దాల్చిన విషయాన్ని ఏమాత్రం దాచిపెట్టనని చెప్పింది. తల్లిని కాబోతున్నందుకు చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది. సినిమాల్లో తాను నటించేది లేనిది తన మానసిక, ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుందని కరీనా చెప్పుకొచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సరైన వ్యక్తి దొరికితే డేటింగ్ చేసేందుకు అభ్యంతరం లేదు : పూజా హెగ్డే