Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కమల్ హాసన్‌ను ఓ సారి హత్తుకున్నా.. 4 రోజులు స్నానం చేయలేదు : హీరో శివరాజ్‌కుమార్

కమల్ హాసన్‌ను ఓ సారి హత్తుకున్నా.. 4 రోజులు స్నానం చేయలేదు : హీరో శివరాజ్‌కుమార్
, మంగళవారం, 1 డిశెంబరు 2015 (13:28 IST)
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విలక్షణ నటుడు కమల్ హాసన్‌ను ఒక్కసారి హత్తుకున్నానని (ఆలింగనం) ఆ తర్వాత నాలుగు రోజుల పాటు తాను స్నానం చేయలేదని చెప్పుకొచ్చారు. దీనికి కారణం లేకపోలేదన్నారు. 
 
కర్ణాటక చలనచిత్ర అకాడమీ, బెంగళూరులో నిర్వహించిన బెళ్లి హెజ్జి కార్యక్రమలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివరాజ్‌కుమార్ దంపతులకు  నిర్వాహకులు ఘన సన్మానం చేశారు. అనంతరం శివరాజ్‌కుమార్ తన జీవితంలోని తన కొన్ని సంగతులను మీడియాతో పంచుకున్నారు. తండ్రి అడుగుజాడల్లోనే తాను నడుస్తున్నానని, ఆయనే తనకు ఆదర్శమన్నారు. 
 
తాను చిన్నప్పటి నుంచి స్టార్ కొడుకుగాకాకుండా సాధారణ పిల్లాడిలా పెరిగానని చెప్పుకొచ్చారు. కాలేజీకి బస్‌లో వెళ్లేవాడినన్నారు. తాను సినిమాల్లోకి రాకుండా ఉండివుంటే మంచి క్రికెటర్‌గా రాణించివుండేవాడినని చెప్పారు. కాలేజీలో చదువుకునే సమయంలో క్రికెట్ బాగా ఆడేవాడిననీ, దాన్ని అలా కొనసాగించి ఉండివుంటే దేశం కోసం మంచి క్రికెటర్గా మిగలేవాడినన్నారు. కానీ విధి మరోలా ఉండి యాక్టింగ్ స్కూలుకు వెళ్లాల్సి వచ్చిందంటూ చిన్ననాటి సంగతులను గుర్తుచేసుకున్నారు.
 
అలాగే, విలక్షణ నటుడు కమల్ హాసన్ అంటే తనకు చాలా ఇష్టమని, వల్లమాలిన అభిమానమన్నారు. అందుకే ఒకసారి కమల్ హాసన్ తనను ఆలింగనం చేసుకున్నపుడు నాలుగు రోజులు స్నానం చేయలేదన్నారు. ఎందుకంటే ఆయన్ని హత్తుకున్న పరిమళం తనను వీడిపోవడం ఇష్టంలేక అలా చేశానని వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu