Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమించే వ్యక్తి మోసం చేస్తే.. వాడు కుళ్ళి ఏడ్చేలా మనం బతకాలి: కంగనా రనౌత్

ప్రేమించే వ్యక్తి మోసం చేస్తే.. వాడు కుళ్ళి ఏడ్చేలా మనం బతకాలి: కంగనా రనౌత్
, శుక్రవారం, 27 నవంబరు 2015 (11:18 IST)
ఎవ్వరినీ ఎక్కువగా నమ్మకూడదని, మగాడిని అసలే నమ్మకూడదని ఫెమినిస్టుగా మాట్లాడుతోంది నటి కంగనా.
ప్రేమలో విఫలమైతే అదేదో జీవితం పోయినట్లు నిరుత్సాహపడకూడదని ఇదే జీవితం కాదని యువతను ప్రబోధిస్తుంది. ఇటీవేల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రేమ గురించి మాట్లాడింది. 
 
లవ్‌ ఫెయిల్యూర్‌ నా దృష్టిలో మంచి ఎక్స్‌పీరియన్స్‌.. సినిమాల్లో వున్నట్లు ప్రేమికుడు మంచిగా వుండడు. అదంతా నటనే. నిజజీవితంలో వున్నాడంటే అదృష్టమే. అలాంటివాడినే మహిళ వెతుక్కోవాలి.

అందరూ అలాంటి మగాళ్ళు వుంటారని నేననుకోను.  నేను ప్రేమిస్తే మంచి వ్యక్తినే ఆలోచించి ప్రేమిస్తాను. ఫెయిల్‌ అయితే.. దాన్ని పెద్దగా పట్టించుకోను. ఒకవేళ ప్రేమించిన వ్యక్తి మోసం చేస్తే.. వాడు కుళ్ళి ఏడ్చేలా మనం బతకాలంటూ గీతోపదేశం చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu