Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కళ్యాణ్‌ రామ్‌ సినిమా... పూరీ దర్శకత్వంలో....

కళ్యాణ్‌ రామ్‌ సినిమా... పూరీ దర్శకత్వంలో....
, బుధవారం, 27 ఏప్రియల్ 2016 (19:31 IST)
వరుసగా చిరంజీవి వారసుల చిత్రాల ముహూర్తాలు జరుగుతున్నాయి. అలాగే ఈ శుక్రవారమే నందమూరి కల్యాణ్‌ రామ్‌ కూడా సిద్ధమవుతున్నాడు. పూరీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను, కల్యాణ్‌ రామ్‌ తన సొంత బ్యానర్‌ పైన నిర్మించనున్నాడు. మే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ జరపాలనే ఆలోచనలో వున్నారు. 
 
ఇందులో కల్యాణ్‌ రామ్‌ పవర్ఫుల్‌ జర్నలిస్ట్‌గా కనిపించనున్నాడు. ఆయన పాత్రను పూరీ జగన్నాథ్‌ వైవిధ్యభరితంగా మలిచాడనీ, అందువలన కల్యాణ్‌ రామ్‌ ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాడని అంటున్నారు. 'షేర్‌' తరువాత కల్యాణ్‌ రామ్‌ చేస్తోన్న సినిమా ఇదే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దర్శకుడు తేజ గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడా... ప్రాణహాని అంటూ ఓ వ్యాపారి పోలీసు కేసు...