Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ టూరిజం కోసం తెలుగు పాటలో నటించనున్న కాజోల్..

ఏపీ టూరిజం కోసం తెలుగు పాటలో నటించనున్న కాజోల్..
, గురువారం, 28 ఏప్రియల్ 2016 (09:50 IST)
ఒకప్పుడు ఉత్తరాది అగ్ర నటిగా పేరు కొట్టేసిన కాజోల్.. ప్రస్తుతం తెలుగులో నటించనుంది. నిజమా? అని అడుగుతున్నారు కదూ. నిజమే. అయితే కాజోల్ తెలుగు నటించడం సినిమా కోసం కాదు.. ఓ పాట కోసం.. అది కూడా ఏపీ టూరిజం ప్రచారం కోసం చిత్రీకరిస్తున్న ఓ పాటలో కాజల్ నటించనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఏపీ టూరిజం ప్రచార కర్తలుగా కాజోల్ ఆమె భర్త అజయ్ దేవగన్ నియామకమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ టూరిజం ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు ప్రమోషనల్ సాంగ్ తీసేందుకు టూరిజం శాఖ రెడీ అయ్యింది. 
 
ఈ సాంగ్ షూటింగ్‌లో పాల్గొనాల్సిందిగా ఏపీ సర్కాను నుంచి కాజోల్‌కు పిలుపు అందింది. కాగా గుజరాత్‌కి అమితాబ్ బచ్చన్ పర్యాటక ప్రచార కర్తగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాజోల్ కూడా ఏపీ టూరిజం ప్రమోషన్‌లో భాగం కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆమెకు రజినీకాంత్‌తో మాట్లాడితే తెలియని విషయాలేవీ లేవనిపిస్తుందట