Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పూజా హెగ్డేతో హృతిక్ మొహంజదారో తుస్.. యామిగౌతమ్‌తో ''కాబిల్'' అదుర్స్.. ట్రైలర్ వైరల్..

పూజా హెగ్డేతో నటించిన మొహంజదారో బెడసి కొట్టడంతో ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తర్వాతి సినిమాను ఎంచుకోవడంలో కాస్త ఆచీతూచీ వ్యవహరించారని చెప్పాలి. తాజాగా యామిగౌతమ్‌తో హృతిక్ నటించిన కాబిల్ సినిమా ష

పూజా హెగ్డేతో హృతిక్ మొహంజదారో తుస్.. యామిగౌతమ్‌తో ''కాబిల్'' అదుర్స్.. ట్రైలర్ వైరల్..
, శుక్రవారం, 28 అక్టోబరు 2016 (16:45 IST)
పూజా హెగ్డేతో నటించిన మొహంజదారో బెడసి కొట్టడంతో ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తర్వాతి సినిమాను ఎంచుకోవడంలో కాస్త ఆచీతూచీ వ్యవహరించారని చెప్పాలి. తాజాగా యామిగౌతమ్‌తో హృతిక్ నటించిన కాబిల్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
ప్రతీకారం నేపథ్యంలో దృష్టి లోపం ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య సాగిన ప్రేమకథగా కాబిల్ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా ట్రైలర్ అక్టోబర్ 26వ తేదీన సినీ యూనిట్ విడుదల చేసింది. విడుదలైన 48 గంటల్లోనే పది లక్షల వ్యూస్ కొట్టేసింది. ఈ సందర్భంగా తమ సినిమా ట్రైలర్‌ను ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళకు సినీ యూనిట్ ధన్యవాదాలు తెలిపింది. 
 
ట్రైలర్ తరహాలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటుందని సినీ యూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాను హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ నిర్మిస్తుండగా, దీనికి సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూర్యతో శ్రుతి లుక్ అదిరింది.. కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయ్యిందే.. (photo)