Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాధికా నా చెల్లెలు... ఆమెతో న్యూడ్ సీన్లు చిత్రీకరించినందుకు సిగ్గుగా లేదు : నిర్మాత అసీమ్ బజాజ్

రాధికా ఆప్టే. బాలీవుడ్ నటి. న్యూడ్ సీన్లలో నటించే హీరోయిన్లలో ముందు వరుసలో ఉండే భామ. ఈ తరహా సీన్లలో నటించే ఈ భామ మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. తాజాగా 'పర్చేద్' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.

రాధికా నా చెల్లెలు... ఆమెతో న్యూడ్ సీన్లు చిత్రీకరించినందుకు సిగ్గుగా లేదు : నిర్మాత అసీమ్ బజాజ్
, బుధవారం, 17 ఆగస్టు 2016 (13:56 IST)
రాధికా ఆప్టే. బాలీవుడ్ నటి. న్యూడ్ సీన్లలో నటించే హీరోయిన్లలో ముందు వరుసలో ఉండే భామ. ఈ తరహా సీన్లలో నటించే ఈ భామ మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. తాజాగా 'పర్చేద్' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో కూడా న్యూడ్ సన్నివేశాల్లో నటించినట్టు వార్తలు వస్తున్నాయి. అంతేనా.. కొన్ని సీన్లు కూడా సోషల్ మీడియాలో లీక్ అయినట్టు సమాచారం. దీనిపై ఆ చిత్ర నిర్మాత ఆసీమ్ బజాజ్ మీడియా ముందుకు వచ్చారు. 
 
'రాధిక నా చెల్లెలులాంటిది. ఇలాంటి న్యూడ్‌ సీన్లు లీక్‌ చేసి ప్రచారానికి వాడుకోవాలని మేం అనుకోలేదు. అలాంటి సీన్లు చిత్రీకరించినందుకు కూడా మేం సిగ్గుపడటం లేదు. రాధిక కూడా ఆ సీన్ల చిత్రీకరణ సమయంలో చాలా సహకరించింది. ఈ సినిమాను యూఎస్‌, ఫ్రాన్స్‌లోని పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శించాం. అక్కడి నుంచే లీకైందని అనుకుంటున్నామ'ని ఆయన చెప్పారు.
 
మరోవైపు.. నిర్మాత అసీమ్ బజాజ్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సోదరిలాంటి వ్యక్తితో ఇలాంటి సన్నివేశాలు చిత్రీకరిస్తావా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా, తన శృంగార సన్నివేశాలు ఎంతగా సంచలనం సృష్టిస్తున్నా 'కబాలి' హీరోయిన్ రాధిక మాత్రం స్పందించక పోవడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాధికా ఆప్టే శృంగార దృశ్యాలని ఎందుకంటారు.. ఆదిల్ శృంగార వీడియో అని ఎందుకనరు?