Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫోర్స్-2 కోసం.. ఏకంగా 1580కిలోల బెంజ్ కారును ఎత్తేశాడోచ్.. జాన్ అబ్రహామా మజాకా..

బాలీవుడ్ కండల వీరుడు జాన్ అబ్రహాం తాజాగా ఫోర్స్-2 పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు. గతంలో ఓ సినిమా కోసం పల్సర్ బైక్‌ను చేతులతో పట్టుకుని గాల్లోకి లేపిన ఈ హీరో... ఫోర్స్-2లో అంతకన్నా ఎక్కువ బరువే ఎత్తాడు. త

ఫోర్స్-2 కోసం.. ఏకంగా 1580కిలోల బెంజ్ కారును ఎత్తేశాడోచ్.. జాన్ అబ్రహామా మజాకా..
, గురువారం, 29 సెప్టెంబరు 2016 (11:53 IST)
బాలీవుడ్ కండల వీరుడు జాన్ అబ్రహాం తాజాగా ఫోర్స్-2 పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు. గతంలో ఓ సినిమా కోసం పల్సర్ బైక్‌ను చేతులతో పట్టుకుని గాల్లోకి లేపిన ఈ హీరో... ఫోర్స్-2లో అంతకన్నా ఎక్కువ బరువే ఎత్తాడు. తక్కువ బరువేం కాదు.. ఏకంగా 1580 కిలోలు. నిజమేనా అంటూ షాకవుతున్నారు కదూ..  మెర్సెడ్స్ బెంజ్ కారును జాన్ అబ్రహం రెండు చేతులతో పట్టుకుని గాల్లోకి లేపాడట. 
 
ఈ యాక్షన్ సీన్‌ను ఫోర్స్-2 కోసం చిత్ర దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడట. సినిమాకే హైలైట్‌గా ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారట. ఈ సీన్ చేయడం కోసం జాన్ చాలా కష్టపడ్డాడని సినీ యూనిట్ అంటోంది. ఈ బరువు ఎత్తేందుకు అబ్రహాం 6-7 గంటల వరకు జిమ్‌లోనే గడిపేవాడట. ఫోర్స్-2లో జాన్‌కు జంటగా సోనాక్షి సిన్హా నటిస్తోంది. అభినయ్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల మధ్య భారీ స్పందన లభించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'సెల్ఫీ క్వీన్‌' కరీనా కపూర్.. ఆడపిల్ల పుడితే సైఫీనా అనే పేరు పెడుతుందా?