Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నయనతారపై జయం రవి ప్రశంసలు : నయన్ చాలా టాలెంట్ అంటూ..?

నయనతారపై జయం రవి ప్రశంసలు : నయన్ చాలా టాలెంట్ అంటూ..?
, బుధవారం, 26 ఆగస్టు 2015 (12:08 IST)
నయనతార భారీ ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా తమిళంలో మరో సినిమాకి సైన్ చేసింది. ఈసారి జయం రవి సరసన నటించనుంది. ఇప్పటికే నయనతార నటిస్తున్న మూడు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఒక్క శేఖర్ కమ్ముల అనామిక సినిమా తప్ప మిగతా అన్ని సినిమాలు వచ్చే సంవత్సరం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. జయం రవి – నయనతార నటించనున్న ఈ సినిమాకి జయం రాజ డైరెక్టర్.
 
ఇందులో విశేషమేమిటంటే.. జయం రవి తన బ్రదర్ జయం రాజ దర్శకత్వంలో ఆరోసారి కలిసి నటించనున్నాడు. త్వరలోనే నయనతార అజిత్ హీరోగా, విష్ణువర్ధన్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నటిస్తోంది. అలాగే ఆర్యతో రాజారాణి సినిమాలో నటిస్తోంది. 
 
నయనతారతో సినిమా చేస్తున్న జయం రవి మాట్లాడుతూ.. నయనతార నటనాపరంగా ఆమెకు చాలా టాలెంట్ ఉందని చెప్పాడు. పని విషయంలో  నయనతార పక్కా అంటూ జయం రవి కితాబిచ్చాడు. తన పాత్రకు న్యాయం చేసేందుకు గాను నయనతార తీవ్రంగా కృషి చేస్తుందని తెలిపాడు. నయనతార నటిగా రాణించేందుకు ఆమెలోని నిజాయితీ, సహనశం, సానుకూల ఆలోచనలే కారణమని జయం రవి కితాబిచ్చాడు. కాగా తని ఒరువన్ అనే సినిమాలో జయం రవి, నయనతార తొలిసారిగా జతకట్టనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu