Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూ.ఎన్టీఆర్ అభిమానులకు పండగ... 'జనతా గ్యారేజ్' బెనిఫిట్ షోలకు ఒకే

ఏపీలో 'జనతా గ్యారేజ్‌' సినిమా బెనిఫిట్‌ షోలకు ఏపీ సర్కారు అనుమతిచ్చింది. ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవడంతో సమస్య సద్దుమణిగినట్టు సమాచారం. బెనిఫిట్‌ షోలను యథావిధిగా వేసుకోవచ్చని అధికారులు గ్రీన్‌సిగ్

జూ.ఎన్టీఆర్ అభిమానులకు పండగ... 'జనతా గ్యారేజ్' బెనిఫిట్ షోలకు ఒకే
, బుధవారం, 31 ఆగస్టు 2016 (12:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన హీరో నటించిన కొత్త చిత్రం "జనతా గ్యారేజ్" సెప్టెంబర్ ఒకటో తేదీ గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, ఏపీ సర్కారు ఆగస్టు 31వ తేదీ అర్థరాత్రి బెనిఫిట్ షోల ప్రదర్శనపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో జూనియర్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. 
 
ఈనేపథ్యంలో ఏపీలో 'జనతా గ్యారేజ్‌' సినిమా బెనిఫిట్‌ షోలకు ఏపీ సర్కారు అనుమతిచ్చింది. ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవడంతో సమస్య సద్దుమణిగినట్టు సమాచారం. బెనిఫిట్‌ షోలను యథావిధిగా వేసుకోవచ్చని అధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారు. దీంతో ఆగస్టు 31వ తేదీ అర్థరాత్రి నుంచి బెనిఫిట్‌ షోలు ప్రారంభం కానున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్పెషల్ స్టేటస్‌ కోసం పవన్ స్పీచ్‌తో గుండె బరువెక్కింది... కల్యాణ్ ఉద్యమానికి సపోర్ట్.. సంపూ లేఖ