Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'పులి' హీరో విజయ్.. సమంత - నయనతార ఇళ్ళలో ఐటీ సోదాలు

'పులి' హీరో విజయ్.. సమంత - నయనతార ఇళ్ళలో ఐటీ సోదాలు
, బుధవారం, 30 సెప్టెంబరు 2015 (11:04 IST)
తమిళ నటుడు, 'పులి' చిత్ర హీరో విజయ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్‌లలో హీరోయిన్లుగా చెలామణి అవుతున్న సమంత, నయనతార ఇళ్ళలో ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం ఉదయం ఆకస్మిక సోదాలు నిర్వహిచారు. చెన్నై సహా దేశ వ్యాప్తంగా 32 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. తిరువనంతపురం, కొచ్చిలోని నయనతార ఇళ్లలో, చెన్నై, హైదరాబాద్‌లోని సమంత ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. 
 
హీరో విజయ్ నటించిన 'పులి' చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. వాస్తవానికి ఈ చిత్రానికి సమంత, నయనతారలకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ... వారి ఇళ్ళలో కూడా సోదాలు నిర్వహించడం గమనార్హం. అలాగే, 'పులి' చిత్ర నిర్మాతలు ఎస్.థమీన్స్, పీటీ సెల్వకుమార్ ఇళ్ళలో కూడా ఈ సోదాలు నిర్వహించారు. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఐటీ అధికారులు వెల్లడించాల్సివుంది. కాగా, పులి చిత్రం అక్టోబర్ ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

Share this Story:

Follow Webdunia telugu