Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీదేవి కోసమే రామ్ గోపాల్ వర్మ సినిమాల్లోకి వచ్చాడా? ఆయన గురించి కొన్ని నిజాలు

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి తెలియని వారుండరు. సినిమాల కంటే వివాదంలో ముందుండే ఈ దర్శకుడు కెరీర్‌ ప్రారంభంలో తెరకెక్కించిన ఎన్నో సినిమాలు అప్పట్లో ట్రెండ్‌ను సెట్‌ చేశాయని ప్రత్యేకంగా చె

శ్రీదేవి కోసమే రామ్ గోపాల్ వర్మ సినిమాల్లోకి వచ్చాడా? ఆయన గురించి కొన్ని నిజాలు
, బుధవారం, 17 ఆగస్టు 2016 (12:13 IST)
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి తెలియని వారుండరు. సినిమాల కంటే వివాదంలో ముందుండే ఈ దర్శకుడు కెరీర్‌ ప్రారంభంలో తెరకెక్కించిన ఎన్నో సినిమాలు అప్పట్లో ట్రెండ్‌ను సెట్‌ చేశాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వర్మ గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం...
 
రామ్‌ గోపాల్‌ వర్మ సొంతూరు విజయవాడ. ఏప్రిల్‌ 7, 1962వ సంవత్సరంలో జన్మించాడు. విజయవాడలోనే విద్యాభ్యాసం పూర్తి చేసుకుని, ఏదైనా వ్యాపారం చేయాలని హైదరాబాద్‌‌కి వచ్చాడు. హైదరాబాద్‌కి చేరుకున్నాక వీసీఆర్‌లు, సినిమా క్యాసెట్‌లు అద్దెకు ఇచ్చే వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఒకసారి పైరసీ వీసీడీలను అమ్మి అరెస్టు కూడా అయ్యాడు. 
 
సహాయ దర్శకుడిగా పనిచేయకుండానే.... దర్శకుడిగా నాగార్జునను హీరోగా ''శివ'' సినిమాను తెరకెక్కించాడు. సినిమాల్లోకి రాక ముందు వర్మ ఇంజనీర్‌గా పని చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న తాజ్‌కృష్ణ నిర్మాణంలో సైట్‌ ఇంజనీర్‌గా పని చేశాడు. ఆ సమయంలో వర్మ నెలకు 800 జీతం సంపాదించేవాడు. ఆ తర్వాత వర్మకు నైజీరియా వెళ్లే అవకాశం వచ్చింది. నెలకు 4 వేల జీతం కావడంతో వర్మ వెళ్లేందుకు సిద్దం అయ్యాడు. కాని చివరి నిమిషంలో అనుకోని కారణాల వల్ల వెళ్లలేకపోయాడు.
 
వర్మ తన మొదటి సినిమాగా ''రాత్రి'' సినిమాని తెరకెక్కించాలని భావించాడట. కాని నాగార్జున సోదరుడు ఇలాంటి కథ కాకుండా హీరోయిజంను ఎలివేట్‌ చేసే కథ అయితే బావుంటుందని అభిప్రాయపడ్డాడట. దాంతో ''శివ'' సినిమా కథ రెడీ చేశాడు.
 
వర్మకు హాలీవుడ్ సినిమాలంటే మహా పిచ్చి. వర్మ సినిమాలపై ఎక్కువగా హాలీవుడ్‌ సినిమాల ప్రభావం ఉంటుంది. ఆ విషయాన్ని ఆయన సైతం ఒప్పుకుంటాడు.వర్మకు శ్రీదేవి అంటే అమితమైన అభిమానం. ఆమెను ఒక దేవతగా భావించేవాడు. ఆమె కోసమే వర్మ సినిమాల్లోకి వచ్చాడనే టాక్‌ కూడా అప్పట్లో వినిపించింది. ఆమెతో వర్మ పలు సినిమాలు తీశాడు. ఇప్పటికీ వర్మ ఆరాధించే నటి శ్రీదేవి. వర్మకు ఇప్పటి వరకు ఏడు నంది అవార్డులు వచ్చాయి. ఒక్క జాతీయ అవార్డు, 12 ఫిల్మ్‌ ఫెయిర్‌ అవార్డ్‌లు ఇంకా పలు అవార్డులను వర్మ సొంతం చేసుకున్నాడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాయకిగా వచ్చినా డిజాస్టర్ టాకే.. మోహినిగా వస్తానంటోన్న త్రిష