Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీరామరాజ్యం లాంటి భక్తిరస సినిమాల్లో నటించేందుకు సై: నయన

శ్రీరామరాజ్యం లాంటి భక్తిరస సినిమాల్లో నటించేందుకు సై: నయన
, సోమవారం, 30 నవంబరు 2015 (11:23 IST)
శ్రీరామరాజ్యం సినిమాలో సీతగా నటించిన నయనతార మళ్లీ అలాంటి భక్తిరస సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతోంది. శ్రీరామరాజ్యం సినిమాకు తర్వాత కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ వస్తున్న ఆమెకు మళ్లీ అలాంటి చిత్రాల్లో కనిపించాలనుకుంటోంది. అందం .. అందుకు తగిన అభినయంతో అగ్రస్థానానికి చేరుకున్న నయనతార, కథానాయికగా చాలా బిజీగా వుంది.
 
అగ్రకథానాయకుల సరసన .. యువ కథానాయకుల జోడీగా .. కథానాయిక ప్రాధాన్యత గల సినిమాలను చేస్తూ ఆమె తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రస్తుతం వరుసగా గ్లామర్ పాత్రలను చేస్తోంది. ఒకవేళ అలాంటి సినిమాల్లో నటించే ఛాన్స్ వస్తే మాత్రం వదిలిపెట్టేది లేదని స్పష్టం చేస్తోంది. కాగా తన మాజీ ప్రేమికుడు శింబుతో నయన నటిస్తున్న ఇదు నమ్మ ఆళు సినిమా ఫిబ్రవరి 14 లవర్స్ డే సందర్భంగా విడుదల కానుంది. 

Share this Story:

Follow Webdunia telugu