Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐ లవ్ పవన్ కల్యాణ్ అండ్ గాడ్: రామ్ గోపాల్ వర్మ

పవన్, గాడ్ అంటే ఇష్టం.. భక్తులు.. ఫ్యాన్స్ అంటే కష్టం: రామ్ గోపాల్ వర్మ

ఐ లవ్ పవన్ కల్యాణ్ అండ్ గాడ్: రామ్ గోపాల్ వర్మ
, గురువారం, 17 మార్చి 2016 (10:40 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ చేశాడు. కొత్త కొత్త ట్వీట్లతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రామ్ గోపాల్ వర్మ గతంలో పవన్‌కళ్యాణ్‌ను ప్రశంసలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా పవర్‌స్టార్‌పై మళ్లీ కొనియాడాడు.
 
''ఐ లవ్ పవన్‌కళ్యాణ్ అండ్ గాడ్'' అంటూ ట్విట్టర్‌లో కామెంట్‌ను పోస్ట్ చేశారు. పవన్, దేవుడు ఇద్దరూ తనకు ఇష్టమని.. వీరిద్దని చాలా కారణాల వల్ల ఇష్టపడతానన్న వర్మ అవే కారణాల వల్ల భక్తులన్నా, పవన్ అభిమానులన్నా తనకు ద్వేషమని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
 
కాగా రామ్ గోపాల్ వర్మ గతంలో అభిమానులను వర్మ టార్గెట్ చేశాడు. ట్విట్టర్‌లో మహేశ్ బాబుకు 15లక్షల మంది ఫాలోయర్లు ఉండగా, పవన్‌కు కేవలం 6 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారని చెప్పుకొచ్చాడు. ఒకవేళ పవన్ కాస్తంత లేట్‌గా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశాడనుకుంటే... ఒక సూపర్ స్టార్ ఫాలోయర్ల సంఖ్య తక్కువ కాలంలోనే అమాంతం పెరగాలి కదా? అని ప్రశ్నించాడు. చివరకు హీరోయిన్ సమంతను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా 10 లక్షలు ఉందని ఎద్దేవా చేశాడు. 
 
తాను పవన్ కల్యాణ్‌కు అతి పెద్ద ఫ్యాన్ అని... మహేశ్ కన్నా పవన్‌కు తక్కువ ట్విట్టర్ ఫాలోయర్లు ఉండటం తనను బాధిస్తోందని వర్మ కామెంట్ చేశాడు. దీనికి కారణం, పవన్ అభిమానుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులు అయినా అయ్యుండాలి, లేదా టెక్నాలజీపై అవగాహన లేనివారైనా అయ్యుండాలని అన్నాడు.

ఈ సందర్భంగా పవన్ అభిమానులకు ఓ సలహా కూడా ఇచ్చాడు. సమావేశాలను నిర్వహించుకొని, టెక్నీలజీపై అవగాహన కలిగేలా ఒకరికొకరు సహకరించుకోవాలని సూచించిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu