Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''డిక్టేటర్'' దగ్గర క్రమశిక్షణ నేర్చుకున్నా... సోనాల్‌ చౌహాన్‌

''డిక్టేటర్'' దగ్గర క్రమశిక్షణ నేర్చుకున్నా... సోనాల్‌ చౌహాన్‌
, గురువారం, 21 జనవరి 2016 (21:13 IST)
లెజెండ్‌లో టిపికల్‌ పాత్రను పోషించినా.. 'డిక్టేటర్‌'లో పోషించిన పాత్రకు మంచి పేరు వచ్చిందని నటి సోనాల్‌ చౌహాన్‌ తెలియజేస్తుంది. ఇంతకుముందు 'పండుగ చేస్కో'లో పొగరు గల అమ్మాయిగా నటించాను. దానికి దీనికి చాలా పోలిక వుంది. ఇందులో గ్లామర్‌గా కన్పించినా.. మొదటిభాగం కథకు కీలకమైన మలుపు తన పాత్రవల్లే వస్తుంది అంది.
 
ఈ పాయింట్‌ చెప్పగానే.. ఎంతో ఆనందపడ్డాను. సినిమాలో చూశాక మరింత ఆనందాన్ని పొందానని చెప్పింది. బాలకృష్ణ గారితో నటించడం వల్ల నటనాపరంగా పలు విషయాలను, క్రమశిక్షణ నేర్చుకున్నానని తెలియజేసింది. ప్రమోషన్‌లో భాంగా బుధవారంనాడు ఆమె హైదరాబాద్‌ వచ్చింది. డిక్టేటర్‌ చిత్రం తర్వాత పలు ఆఫర్లు వచ్చాయనీ, ఆ వివరాలు త్వరలో తెలియజేస్తానని అంది.

Share this Story:

Follow Webdunia telugu