Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లికి ఇంకా టైమ్ పడుతుంది: అందముంటే సరిపోదు.. కృతి సనన్

పెళ్లికి ఇంకా టైమ్ పడుతుంది: అందముంటే సరిపోదు.. కృతి సనన్
, సోమవారం, 14 సెప్టెంబరు 2015 (12:24 IST)
పెళ్లి-సంసారం అనేవి మనం అనుకున్నప్పుడు జరిగిపోవని.. ముందు వెనకా టైమ్ పట్టొచ్చని మహేష్ భామ కృతిసనన్ అంటోంది. ఏదో ఒకరోజు పెళ్లనేది చేసుకోవాల్సిందే. అది కొందరికి త్వరగా మరికొందరికి లేటుగా జరుగుతుంది. కాబట్టి కాస్త వెయిట్ చేయాలి.. ఇప్పటికైతే నావాడి గురించి ఆలోచించే టైమ్ లేదు. నా దృష్టంతా కెరీర్ పైనేనని కృతి సనన్ చెప్పింది.  
 
"ప్రస్తుతానికి షారూఖ్ సరసన దిల్ వాలే చిత్రంలో నటిస్తున్నా.. అతడితో కెరీర్ ఆరంభమే అవకాశం వస్తుందని ఊహించలేదు. అదృష్టం కొద్దీ హీరో ప్యాంటీ - 1నేనొక్కడినే లాంటి సినిమాల్లో నటించాను. కెరీర్ ఆరంభమే మహేష్ - నాగచైతన్య లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చిందంటే అది నా అదృష్టమే'' అని కృతిసనన్ వెల్లడించింది.  
 
పెద్ద స్టార్లతో నటించినంత మాత్రాన.. తాను పెద్ద స్టార్‌‍ని అనుకోనని తెలిపింది. ఇంకా చేయాల్సిందే చాలా వుందని చెప్పుకొచ్చింది. గర్వం తెచ్చుకోకుండా పనిచేస్తానని కృతి చెప్పింది. పాత్రల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులేస్తాను. ఎందుకంటే మనపై నెగెటివ్ ఇంప్రెషన్ పడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అలాగే నటించడానికి అందం ఒక్కటే ఉంటే సరిపోదు. పెర్ఫామెన్స్ లేకపోతే నటిగా క్లిక్కవ్వడం కష్టం.. అని కృతి అనుభవ పాఠాల్ని చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu