Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కల్యాణ్ బాపూగారి బొమ్మ ప్రణీతకు టాలీవుడ్‌లో ఆ గ్రేడే..?

పవన్ కల్యాణ్ బాపూగారి బొమ్మ ప్రణీతకు టాలీవుడ్‌లో ఆ గ్రేడే..?
, శనివారం, 5 సెప్టెంబరు 2015 (13:17 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాపుగారి బొమ్మ.. అదేనండీ.. ప్రణీతకు టాలీవుడ్‌లో సెకండరీ గ్రేడే ఇవ్వొచ్చునని సినీ పండితులు అంటున్నారు. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ కెరీర్ ప్రారంభించి ఇప్పటికే ఐదేళ్లు గడిచినా ఫస్ట్ హీరోయిన్ ఛాన్సుల్ని దాదాపు మింగేసింది. పవన్ కల్యాణ్ -ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో నటించినా.. అది సెకండ్ హీరోయిన్ వరకే పరిమితమైంది. 
 
ఇప్పటికీ తనో పెద్ద స్టార్ హీరోయిన్ అని మాత్రం అనిపించుకోలేకపోయింది. తనతో పాటే కెరీర్ సాగించిన సమంత ఫస్ట్ క్లాస్ హీరోయిన్‌గా దూసుకుపోతుంటే తను మాత్రం ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టే ఉంది. లేటెస్టుగా విష్ణు సరసన డైనమైట్ సినిమాలో నటించిన ఈ అమ్మడు పేలవంగా తేలిపోయిందంటూ విమర్శలొస్తున్నాయి. 
 
యాక్షన్ సెంటిమెంటు రొమాన్స్ ఫైర్ లవ్ .. ఇలా సందర్భం ఏదైనా అక్కడ ఈవిడ పలికించే ఎక్స్‌ప్రెషన్ ఒకే ఒక్కటి. ఒకే ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో సినిమా మొత్తం లాగించేసిందని సినీ పండితులు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ప్రణీత తన యాక్టింగ్ స్కిల్స్ మార్చుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu