Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీకే చెప్పేది, మా ఇద్దర్నీ వీడియో తీయొద్దు: ఫోటోగ్రాఫర్లపై కృతి సనన్ ఆగ్రహం

Advertiesment
Kriti sanon

ఐవీఆర్

, మంగళవారం, 13 జనవరి 2026 (18:01 IST)
సినీ నటులు తమ వ్యక్తిగత విషయాలు గోప్యంగా వుండాలని కోరుకుంటారు. కానీ సినీ సెలబ్రిటీలు తమ కంటికి కనిపిస్తే ఊరుకుంటారా ఫోటోగ్రాఫర్లు, ఎక్కడ కనబడితే అక్కడ అలానే బంధించేస్తారు. ఇప్పుడు అదే జరిగింది. బాలీవుడ్ నటి కృతి సనన్ తన బోయ్ ఫ్రెండుతో వుండగా ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు తమ కెమేరాలకు పని చెప్పారు. అదేపనిగా తీయడం మొదలుపెట్టారు. 
 
ఇది గమనించిన కృతి సనన్ వారిపై గట్టిగా కేకలు వేసింది. ఏయ్.. ఏం చేస్తున్నారు. ఫోటోలు తీయకండి, వీడియోలు తీయకండి అంటూ చేతులు ఊపుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అప్పటికే ఫోటోగ్రాఫర్లు తాము చేయాల్సిందంతా చేసేసారు. తన సోదరి నూపుర్ సనన్ వివాహ వేడుకకు హాజరైన కృతి సనన్ తన ప్రియుడు రావడంతో అతడితో కాస్త సన్నిహితంగా కనబడింది. ఈ ఘటన విమానాశ్రయంలో చోటుచేసుకున్నది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Maruti: రాజా సాబ్ గా ప్రభాస్ ని కొత్తగా చూపించాననే ప్రశంసలు వస్తున్నాయి : మారుతి