Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా క్లైయింట్‌కు రూ.10 కోట్లు చెల్లించాలి.. సల్లూభాయ్‌కు అడ్వకేట్ లీగల్ నోటీసు

సల్మాన్ తాజా చిత్రం ''సుల్తాన్'' ప్ర‌మోష‌న్‌లో భాగంగా బాలీవుడ్ కండ‌ల వీరుడు రేప్‌పై చేసిన వ్యాఖ్య‌లు వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే స‌ల్మాన్‌కు లీగ‌ల్ నోటీసులు పంపించింది హ‌ర్యాణా

నా క్లైయింట్‌కు రూ.10 కోట్లు చెల్లించాలి.. సల్లూభాయ్‌కు అడ్వకేట్ లీగల్ నోటీసు
, సోమవారం, 27 జూన్ 2016 (11:49 IST)
సల్మాన్ తాజా చిత్రం ''సుల్తాన్'' ప్ర‌మోష‌న్‌లో భాగంగా బాలీవుడ్ కండ‌ల వీరుడు రేప్‌పై చేసిన వ్యాఖ్య‌లు వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే స‌ల్మాన్‌కు లీగ‌ల్ నోటీసులు పంపించింది హ‌ర్యాణా రాష్ట్రానికి చెందిన అత్యాచార బాధితురాలు. హ‌ర్యాణా పంజాబ్ రాష్ట్ర హైకోర్టు అడ్వ‌కేట్ ర‌జ‌త్ క‌ల్సాన్...  స‌ల్మాన్ ఖాన్ ముంబ‌ై నివాసానికి ఈ నోటీసుల‌ను పంపారు. ఓ అత్యాచార బాధితురాలు సల్మాన్‌ చేసిన వ్యాఖ్యలకి రూ.10 కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేస్తూ భాయ్‌కి లీగల్‌ నోటీసు పంపింది. 
 
స‌ల్మాన్ చేసిన వ్యాఖ్య‌లు త‌న మనసుని ఎంతగానో బాధించాయనీ బాధితురాలు నోటీసులో పేర్కొంది. అదికూడా నోటీసులు అందిన 15 రోజుల్లోనే ఆ మొత్తాన్ని త‌న‌కు చెల్లించాల‌ని బాధితురాలు హెచ్చరించింది. బాధితురాలి త‌రుపున లాయ‌ర్ ర‌జ‌త్... త‌న క్లైంట్‌కు రూ.10 కోట్లు చెల్లించ‌ని నేప‌థ్యంలో స‌ల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్య‌ల‌కు త‌ప్ప‌కుండా శిక్ష అనుభ‌వించి తీరాల్సిందేనంటూ పేర్కొన్నారు. అత్యాచార బాధితురాలు ఓ ద‌ళితురాల‌ని ఆయ‌న వెల్ల‌డించారు. అయితే సల్లూ భాయ్ మాత్రం ఈ వాదనపై ఇంకా స్పందించలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పారిస్‌లోని ''లీ గ్రాండ్ రెక్స్''లో కబాలి సినిమా ప్రీమియర్ షో.. దటీజ్ రజినీకాంత్!