Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ కళ్యాణ్ కోరితే జనసేన పార్టీ కోసం పనిచేస్తా : హీరో సునీల్

మెగా కాంపౌండ్‌కు చాలా దగ్గర ఉండే సినీ ప్రముఖుల్లో కమెడియన్ కమ్ హీరోగా మారిన సునీల్ ఒకరు. చిరంజీవి అన్నా.. పవన్ కళ్యాణ్ అన్నా చాలా గౌరవం. వారికోసం ఏమైనా.. ఎలాంటి త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు.

పవన్ కళ్యాణ్ కోరితే జనసేన పార్టీ కోసం పనిచేస్తా : హీరో సునీల్
, బుధవారం, 10 ఆగస్టు 2016 (14:41 IST)
మెగా కాంపౌండ్‌కు చాలా దగ్గర ఉండే సినీ ప్రముఖుల్లో కమెడియన్ కమ్ హీరోగా మారిన సునీల్ ఒకరు. చిరంజీవి అన్నా.. పవన్ కళ్యాణ్ అన్నా చాలా గౌరవం. వారికోసం ఏమైనా.. ఎలాంటి త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఈ విషయాన్ని పలు లైవ్ ఇంటర్వ్యూల్లో చెప్పిన సునీల్.. తాజాగా మరోమారు ఇదే  విషయాన్ని పునరుద్ఘాటించారు. 
 
'పవన్‌ అడిగితే జనసేన పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎలక్షన్‌లో పోటీచేయాలనే ఆసక్తి లేదు కానీ, పవన్‌ కోసం పనిచేయడానికి మాత్రం రెడీ' అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. అలాగే హీరోగా కొనసాగుతున్నా కమెడియన్‌ రోల్స్‌ వేయనని తానెప్పుడూ చెప్పలేదని తెలిపాడు. ఇక, చిరంజీవి 150వ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనబడతానని చెప్పుకొచ్చాడీ హీరో. 
 
కాగా, కమెడియన్‌గా స్టార్‌ హోదా వదులుకుని హీరోగా మారిన సునీల్... మర్యాద రామన్న చిత్రంతో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అక్కడ నుంచి అడపాదడపా విజయాలు సాధిస్తూ ప్రస్తుతానికి ఫామ్‌లోనే ఉన్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైతూ 'ప్రేమమ్' చిత్రంపై మూడు లవ్ సింబల్స్‌తో స్పందించిన సమంత..