రజినీకి 66 యేళ్లు... ఇంకా యువకుడే.. విజయ రహస్యమిదే.... మోడీ - అమితాబ్ విషెస్
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సోమవారం తన 66వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. అయినా ఆయన ఇప్పటికీ చలాకీ యువకుడిగానే కనిపిస్తారు. దీనికి కారణం ఆయన తీసుకునే డైట్, ఫిట్‌నెస్‌పై కనబరిచే శ్రద్ధేనట. తన ఫిట
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సోమవారం తన 66వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. అయినా ఆయన ఇప్పటికీ చలాకీ యువకుడిగానే కనిపిస్తారు. దీనికి కారణం ఆయన తీసుకునే డైట్, ఫిట్‌నెస్‌పై కనబరిచే శ్రద్ధేనట. తన ఫిట్నెస్ రహస్యాన్ని రజినీకాంత్ ఒక ఆడియో ఫంక్షన్లో బయటపెట్టారు. 2008లో విడుదలైన 'కుసేలన్' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో తాను యంగ్‌గా కనపడటానికి గల రహస్యాన్ని రజినీ బయటపెట్టారు. నాడు ఆయన ఏం చెప్పారంటే.. షుగర్, రైస్, మిల్క్, కర్డ్, ఘీ వంటి వాటికి దూరంగా ఉండటం. ముఖ్యంగా 40 సంవత్సరాలు పైబడిన తర్వాత వీటిని దూరం పెట్టిన వారెవరైనా యంగ్ లుక్ సొంతం చేసుకోవచ్చని, ప్రతిరోజు ఉదయం 5 గంటలకు తాను నిద్రలేస్తానని, గంట పాటు జాగింగ్ చేస్తానని చెప్పారు.
అంతేకాకుండా, రోజూ మెడిటేషన్ చేయడం, సాయంత్రాల్లో కూడా వాకింగ్ చేయడం, దీంతో పాటు, యోగా కూడా ప్రాక్టీసు చేస్తున్నానని ఆనాడు రజినీ చెప్పారు. యోగా ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చని, రాత్రి నిద్ర బాగా పట్టేందుకు యోగా ఉపకరిస్తుందని.. ఈ ఆరోగ్య సూత్రాలనే తాను పాటిస్తుంటానని, అందుకే, యంగ్‌గా కనపడతానని రజినీ చెప్పుకొచ్చాడు. అందువల్లే రజినీకాంత్‌ను ఆయన అభిమానులు ‘కింగ్ ఆఫ్ స్టైల్’ అని ముద్దుగా పిలుచుకుంటారు.
మరోవైపు.. రజినీకాంత్‌కు ప్రధాని నరేంద్ర మోడీ, బాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రజినీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నానని, ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నానని ప్రధాని మోడీ, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
దేవుడు రజినీని ఆశీర్వదించాలని, తాను రజినీతో కలిసి షూటింగ్లో పాల్గొన్న రోజులను గుర్తు చేసుకున్నానని బాలీవుడ్ నటుడు రిషి కపూర్ పేర్కొన్నాడు. రజినీ ఇలాగే ఏళ్ల తరబడి వినోదాన్ని పంచాలని తాను కోరుకుంటున్నట్లు బాలీవుడ్ హీరో షారుక్‌ఖాన్ పేర్కొన్నాడు. అలాగే, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, బాలీవుడ్ నటి జుహీ చావ్లా, దర్శకురాలు, రజినీ కుమార్తె సౌందర్య రజనీకాంత్ తో పాటు ఎంతోమంది ప్రముఖులు, ఆయన అభిమానులు సోషల్‌మీడియా ద్వారా రజినీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.