Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''గరం'' సినిమా నిరాశ పరిస్తే ఇకపై నా సినిమాలు చూడొద్దు: వర్మ బాటలో ఆది

''గరం'' సినిమా నిరాశ పరిస్తే ఇకపై నా సినిమాలు చూడొద్దు: వర్మ బాటలో ఆది
, ఆదివారం, 14 ఫిబ్రవరి 2016 (17:28 IST)
''గరం'' సినిమా నిరాశపరిస్తే ఇకపై తన సినిమాలు చూడొద్దంటూ యువహీరో ఆది రామ్ గోపాల్ వర్మ స్టైల్‌లో మాట్లాడారు. వంగవీటి సినిమాపై పలు విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో.. నచ్చితే సినిమా చూడండి లేకుంటే మానుకోండి అంటూ వర్మ ఓ టీవీ ప్రోగ్రామ్‌లో తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘గరం’ చిత్రం చూసిన తర్వాత ఎవరైనా కనుక నిరాశ చెందితే ఇక తన చిత్రాలను చూడవద్దని యువహీరో ఆది అన్నాడు. 
 
ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆది మాట్లాడుతూ.. గరం సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశాడు. గరం చిత్రం ప్రేక్షకులకు ఏమాత్రం బోరు కొట్టించదని, ఇది ఫ్యామిలీలను ఆకట్టుకుంటుందని, ఆ గ్యారంటీ తానిస్తున్నానని చెప్పాడు. ‘గరం’ కమర్షియల్ చిత్రమని.. అటువంటి చిత్రంలో క్లైమాక్స్ సీన్ చాలా సెంటిమెంట్‌తో కూడుకున్నదన్నాడు. హోం ప్రొడక్షన్‌లో సినిమా చేయడం సంతోషాన్నిచ్చిందని చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu