Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సన్నీ లియోన్‌పై ఎఫ్ఐఆర్: మస్తీజాదేలో టెంపుల్‌లో ఆ సీన్.. కత్తిరిస్తారా?

సన్నీ లియోన్‌పై ఎఫ్ఐఆర్: మస్తీజాదేలో టెంపుల్‌లో ఆ సీన్.. కత్తిరిస్తారా?
, బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (17:54 IST)
పోర్న్ స్టార్, బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ మస్తీజాదే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే కొత్త సినిమా విడుదలవుతుందని హ్యాపీగా ఉన్న సన్నీకి పోలీసులు షాక్ ఇచ్చారు. సన్నీ లియోన్‌తో పాటు తుషార్ కపూర్, వీర్ దాస్ తదితరులపై కేసును నమోదు చేశారు. మిలాప్ జవేరి తీసిన మస్తీజాదే సినిమాలో నటించిన నటీనటులతో పాటు సాంకేతిక సిబ్బంది మీద కూడా పోలీసు కేసు దాఖలైంది. 
 
ఇంతకీ సంగతేంటంటే.. మస్తీజాదే సినిమాలో ఓ ఆలయంలో అభ్యంతరకర రీతిలో కండోమ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు ఓ సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశం ద్వారా సెంటిమెంట్లను దెబ్బతీశారంటూ.. ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్ పోలీస్ స్టేషన్లో కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మస్తీజాదే నటీనటులపై కేసు నమోదు చేశారు. 
 
ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు లెక్కలేనన్ని కత్తెరలు వేస్తే తప్ప విడుదలకు నోచుకోలేదు. మరి ఈ కండోమ్ వ్యవహారం సెన్సార్ కంట పడినట్టు లేదని కేసును నమోదు చేసిన వారు తప్పుబడుతున్నారు. మరి ఈ సినిమాలో నటించిన వారిపై కేసు నమోదు చేయడంతో ఆ సన్నివేశాన్ని కట్ చేస్తారో లేదో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu