Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2016 జనవరిలో పెళ్లి చేసుకోవడం లేదు.. ప్రామిస్: ప్రీతిజింటా

2016 జనవరిలో పెళ్లి చేసుకోవడం లేదు.. ప్రామిస్: ప్రీతిజింటా
, ఆదివారం, 29 నవంబరు 2015 (13:16 IST)
బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ప్రీతి జింటా తన పెళ్లిపై వస్తున్న వార్తలపై స్పందించింది. గినె అనే అమెరికన్తో సన్నిహితంగా ఉంటున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. అలాగే 2016 జనవరిలో అతడిని పెళ్లాడుతున్నట్టుగా వార్తలు వినిపించాయి. కొంత మంది మరో అడుగు ముందుకు వేసి ఇప్పటికే నిశ్చితార్థం కూడా అయిపోయినట్టుగా వార్తలొచ్చాయి. అయితే వీటినన్నింటినీ ప్రీతి జింటా కొట్టిపారేసింది.
 
'నేను 2016 జనవరిలో పెళ్లి చేసుకోవటం లేదు. ప్రామిస్. అలాంటి వార్త ఏదైనా ఉంటే ముందు నేనే తెలియజేస్తా..' అంటూ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అయితే గినెతో తన రిలేషన్పై మాత్రం ఎలాంటి కామెంట్ చేయలేదు. దీంతో పెళ్లి విషయం నిజం కాకపోయినా గినెతో ప్రేమ విషయం మాత్రం నిజమేనని బాలీవుడ్ సినీ జనం అనుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu