Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Advertiesment
Trinath Katari, R.P. Patnaik, Sahithi Avanch

చిత్రాసేన్

, శుక్రవారం, 31 అక్టోబరు 2025 (17:00 IST)
Trinath Katari, R.P. Patnaik, Sahithi Avanch
త్రినాధ్ కటారి హీరోగా, స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ ఇట్లు మీ ఎదవ. సాహితీ అవంచ హీరోయిన్ గా నటిస్తున్నారు. వెయేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. యూత్ ఫుల్ ఫన్, బ్యూటీఫుల్ లవ్ స్టొరీ, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ట్రైలర్ అదిరిపోయింది.  
 
త్రినాధ్ కటారి మాట్లాడుతూ.. ఈ సినిమాకి కథే హీరో. ఇందులో నేను ఎదవ అని ఒక క్యారెక్టర్ చేశాను. ఇది ఒక తండ్రి కొడుకులు కథ, తండ్రి కూతుర్ల కథ, ఒక అమ్మాయి అబ్బాయి కథ ఈ ముగ్గురు మధ్య ఉండే లవ్ స్టోరీ. నిర్మాత బళ్లారి శంకర్ గారు చాలా మంచి వ్యక్తి.పట్నాయక్ గారికి ఈ కథ చెప్తున్నప్పుడే ఒక హిట్ సినిమాకి పనిచేయబోతున్నాం అని చెప్పారు. అది చాలా ఆనందాన్నిచ్చింది.  
 
మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి పట్నాయక్ మాట్లాడుతూ.. బాపు గారి సినిమా చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ సినిమా చేస్తే ఆ కోరిక తీరుతుందని ఫీలింగ్ వచ్చింది. త్రినాధ్ డెడికేటెడ్ గా ఫ్యాషన్టెడ్ గా ఈ సినిమాకి పనిచేశారు. ఈ సినిమాకి టైటిల్ సూచించింది కూడా నేనే. కథ విన్నప్పుడే హిట్ వైబ్ వచ్చింది. ఈ సినిమా చూసిన తర్వాత ఇంతకంటే మంచి టైటిల్ మరొకటి లేదనిపించింది. ఇది యూత్ అందరికీ తెగ నచ్చుతుంది. యూత్ వాళ్ళ పేరెంట్స్ ని కూడా తీసుకెళ్లి చూపించే సినిమా అవుతుంది. సినిమా క్లైమాక్స్ లో మీరు ఊహించని అద్భుతమైన కంటెంట్ ఉంటుంది. నటీనటులందరూ అద్భుతంగా చేశారు. ఈ సినిమాకి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో చాలా ఎంజాయ్ చేశాను . టెక్నీషియన్స్ అందరూ చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?