Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అభిమానం చంపుకునే స్థాయిలో ఉండరాదు... మీ బిడ్డగా అండగా ఉంటా : పవన్ కళ్యాణ్

సినీ హీరోలపై అభిమానం ఉండాలే కానీ, చంపుకునేంత స్థాయికి వెళ్లడం మంచిది కాదని హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హితవు పలికారు. కోలార్‌లో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని చేతిలో పవన్ కళ్యాణ్ అభిమాని హత్యకు గ

అభిమానం చంపుకునే స్థాయిలో ఉండరాదు... మీ బిడ్డగా అండగా ఉంటా : పవన్ కళ్యాణ్
, గురువారం, 25 ఆగస్టు 2016 (12:21 IST)
సినీ హీరోలపై అభిమానం ఉండాలే కానీ, చంపుకునేంత స్థాయికి వెళ్లడం మంచిది కాదని హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హితవు పలికారు. కోలార్‌లో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని చేతిలో పవన్ కళ్యాణ్ అభిమాని హత్యకు గురైన విషయంతెల్సిందే. దీంతో హత్యకు గురైన జనసేన కార్యకర్తలు వినోద్ రాయల్ కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ గురువారం స్వయంగా ఓదార్చారు. 
 
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అభిమానం ఉండాలే కానీ చంపుకునేంత స్థాయికి వెళ్లడం మంచిది కాదన్నారు. హీరోలను అభిమానించడం మంచిదే... కానీ మితిమీరిన అభిమానం హింసకు దారితీయడం సహించరానిదన్నారు. సినీ పరిశ్రమంలో తోటి హీరోలతో తనకు ఎప్పుడూ గొడవలు లేవని, ఏ హీరో ఎవరితోనూ గొడవ పడరని పవన్ అన్నారు.
 
హీరోలు ఎప్పుడూ పరస్పరం గొడవ పడరని... అభిమానులు మాత్రం గొడవ పడతారని చెప్పారు. హీరోల మధ్య పోటీ తత్వమే ఉంటుందని తప్ప ఇలాంటి గొడవకు దారితీయడం బాధాకరమన్నారు. వినోద్‌ను హత్య చేసిన వారిని వదిలిపెట్టొద్దని, అరెస్ట్ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని పవన్ డిమాండ్ చేశారు. రెండు నెలల్లో అమెరికా వెళ్లాల్సిన యువకుడు ఇలా చనిపోవడం బాధాకరమన్నారు. 
 
ఆ తర్వాత వినోద్ తల్లి వేదవతి మాట్లాడుతూ.. ఓ బిడ్డలాగా తోడుగా ఉంటానని, తగిన న్యాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చారని తెలిపారు. వినోద్ లక్ష్యాలను సాధించేందుకు తనవంతు కృషి చేస్తానని పవన్ మాట ఇచ్చారని వినోద్ తల్లి వేదవతి అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఆ రహస్యం ఆ ముగ్గురికే తెలుసునట!