Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాడనని.. పాట పాడిన గజల్‌ శ్రీనివాస్‌, వర్మ కోసం... ఎందుకంటే...

పాడనని.. పాట పాడిన గజల్‌ శ్రీనివాస్‌, వర్మ కోసం... ఎందుకంటే...
, మంగళవారం, 22 మార్చి 2016 (21:23 IST)
కొన్ని సినిమాల్లో కొందరు పాడమని గిరి గీసుకుంటున్నారు. అలాంటివారిలో గజల్‌ శ్రీనివాస్‌ ఒకరు. తెలుగులో గజల్స్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం తెచ్చిన ఆయన చాలామంది తమ సినిమాల్లో పాటలు పాడమంటే పాడలేదు. మోహన్‌ బాబుకు సన్నిహితుడు కూడా. మోహన్‌బాబు అడిగితేనే పాడలేదు. ఈ విషయాన్ని గజల్‌ శ్రీనివాస్‌ చెప్పారు. గతంలో మంచు విష్ణు హీరోగా వచ్చిన సినిమాలో మోహ్‌బాబు తనను పాడమంటే పాడలేదు. పాటల్లో ఏవో పదాలుంటాయి. అవన్నీ నాకు పాడడం ఇష్టముండదని చెప్పానని తెలిపారు.
 
ఈమధ్య దేవాలయాల గురించి.. వాటి విశిష్టత గురించి.. కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు గజల్‌ శ్రీనివాస్‌. అలాంటి ఆయనకు.. రామ్‌గోపాల్‌ వర్మ నుంచి ఓ పాట పాడమని ఆఫర్‌ వచ్చింది. ముందుగా పాట పాడనని చెప్పేశారు. కానీ వర్మ.. అనుచరుడు గీత రచయిత సిరాశ్రీ రాసిన పాటను చదివాక.. ఒక్కసారిగా మనస్సు మార్చుకున్నారు.. అదేమిటంటే... అందరికీ.. రామాయణాలు, భారతాలు.. తెలుసు. విన్నాక.. కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతాయి. 
 
సీతను రావణాసురుడు టచ్‌ చేయలేదు. కానీ విలన్‌ కోవలోకి చేరిపోయాడు. మహాభారతంలో.. జూదం ఆడి.. సామ్రాజ్యాన్ని.. ద్రౌపదిని.. పోగొట్టుకున్న.. పాండవులు.. చేసింది. కరెక్టా? కాదా? జూదం అనేది తప్పే. శ్రీకృష్ణుడు.. గోపికల వస్త్రాలను దొంగిలిస్తే.. ఆయన్ను దేవుడు అంటున్నాం. అదే.. దుస్తులు ద్రౌపదివి సభలో తీస్తే.. వాడిని ద్రోహి.. అంటున్నాం. ఇదెంతవరకు కరెక్ట్‌.. ఇలా.. పలు ప్రశ్నలు.. అతి మేథావులకు వస్తుంటాయి.
 
అలాంటి వారిలో వర్మ ఒకరు. 'ఎటాక్‌' సినిమాలో బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్‌లో ఇవన్నీ వుంటాయి. ఈ పాటను పాడాలంటే మొదట ఆలోచించాను. కానీ చాలామందిలో వున్న ఆలోచనను వర్మ బయటకు పెట్టడంతో.. ఇదికూడా ఓరకంగా జనాలకు చేరుతుందని.. అందులో వాస్తవం.. అవాస్తవం ఏమిటనేది సినిమా చూస్తే తెలుస్తుందని.. నేను పాట పాడానని.. గజల్‌ శ్రీనివాస్‌ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu