Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

థాకరే, కేసీఆర్, లాలూ కలిస్తే అతనే డొనాల్డ్ ట్రంప్: వర్మ కొత్త ట్వీట్

థాకరే, కేసీఆర్, లాలూ కలిస్తే అతనే డొనాల్డ్ ట్రంప్: వర్మ కొత్త ట్వీట్
, శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (19:12 IST)
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరపున పోటీ పడతాడని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ పైకి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దృష్టి పడింది. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ.. డొనాల్డ్ ట్రంప్‌పై వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లోకెక్కాడు. 
 
అమెరికా చరిత్రలో ఇంత కలర్ ఫుల్, స్వేచ్ఛగా మాట్లాడే వ్యక్తి మరొకరు లేరని డొనాల్డ్ ట్రంప్, ఓ బాల్ థాకరే, ఓ కేసీఆర్, ఓ లాలూ ప్రసాద్ యాదవ్‌లు కలిస్తే, అతనే డొనాల్డ్ ట్రంప్ అవుతారని అన్నారు. ట్రంప్ అధ్యక్షుడు కావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తన ట్విట్టర్ ఖాతాలో వర్మ ట్వీట్ చేశాడు.
 
ఇదిలా ఉంటే.. ఎవరైనా వచ్చి మహాత్మాగాంధీ మీదో లేక మదర్ థెరెస్సా మీదో సినిమా తీస్తామంటే... తీయవద్దు అని చెప్పనని రాంగోపాల్ వర్మ అన్నారు. అలాగే 'నాకు నచ్చిన సినిమా నేను తీసుకుంటానంటే మధ్యలో మీకు వస్తున్న బాధ ఏంటో అర్థం కావడం లేద'ని రాంగోపాల్ వర్మ వాపోయారు. 
 
తన సినిమాల ద్వారా సమాజానికి సందేశం ఇవ్వాలనో లేక వారికి క్లాసులు పీకాలనో ఆలోచన తనకు లేదని, సినిమా తనకు అన్నం పెడుతుంది కనుక తీస్తున్నానని ఆయన అన్నారు.  తనకు సమాజం పట్ల అంతే బాధ్యత ఉందని.. అసలు బాధ్యత ఉందని చెప్పుకునే వారికంటే ఎక్కువ బాధ్యత తనకే ఉందని వర్మ స్పష్టం చేశారు. అయినా తనకు అర్థం కాని విషయం ఏంటంటే...తన సినిమాలో తాను ఏదో చెబితే కమ్మలు, కాపులు ఎందుకు కొట్టుకుంటారని ప్రశ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu