Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమయాన్ని వృథా చేస్తే జీవితాంతం సమస్యలు ఎదుర్కోవాలి : రజనీకాంత్

Advertiesment
rajinikanth
యువత కీలక సమయాన్ని వృథా చేస్తే జీవితాంతం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. ఆయన బుధవారం చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ యువతకు అనేక సలహాలు ఇచ్చారు. యువత చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఎందుకంటే వారికి దెబ్బ తగిలితే వారే నొప్పిని భరించాల్సి ఉంటుందన్నారు. చదువుకునే దశలో చదువుపై దృష్టి సారించాలన్నారు. ఆ కీలక సమయాన్ని వృథా చేస్తే జీవితాంతం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఆరోగ్యాన్ని కూడా అశ్రద్ధ చేయరాదన్నారు. వ్యాయామం ఉపయోగాలను గుర్తించాలని, మత్తు పదార్థాలకు బానిస కావొద్దని, డ్రగ్స్ వాడితే జీవితం నాశనమవుతుందని ఇలాంటి అలవాట్లు ఉన్నవారిని దూరంగా ఉంచాలని సూచించారు. 
 
ఇకపోతే, విజయ్ నటించిన జననాయగన్ మూవీ విడుదలపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకుంటా సారీ.. నో కామెంట్స్ అంటూ వెళ్లిపోయారు. కాగా, తన కొత్త చిత్రం జైలర్-2కు సంబంధించిన ఓ షెడ్యూల్ షూటింగును పూర్తి చేసిన రజనీకాంత్ బుధవారం హైదరాబాద్ నుంచి చెన్నైకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 
 
తాను, కమల్‌హాసన్‌ కలిసి నటించనున్న సినిమా షూటింగ్‌ ఆగస్టులో ప్రారంభమవుతుందని తెలిపారు. 'జైలర్‌-2' షూటింగ్‌ మరికొన్ని రోజుల్లో పూర్తి కానుందని చెప్పారు. ఈ సినిమా విడుదల తేదీని నిర్మాణ సంస్థ త్వరలో నిర్ణయిస్తుందన్నారు. హిట్‌ మూవీ 'జైలర్‌'కు సీక్వెల్‌గా రూపొందుతోంది 'జైలర్‌-2'. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకుడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ అందరి ఊహలకు అందని చిత్రంగా 'రాకా' : సన్ పిక్చర్స్