Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమీర్ ముందు తెలుగు హీరోలందరూ బలాదూర్: ఒక్క సినిమాకు 175 కోట్లు

సినిమా కలెక్షన్ల విషయంలోనే కాదు వ్యక్తిగత రెమ్యునరేషన్ లోనూ 'మిస్టర్ పర్ఫెక్ట్' ముందున్నాడు. ఆమిర్ తాజా చిత్రం 'దంగల్'తో అతడు రూ.175 కోట్లు ఆర్జించినట్టు 'డీఎన్ఏ' పత్రిక వెల్లడించింది. విశ్వసనీయ వర్గాల ద్వారా సంపాదించిన సమాచారం ప్రకారం ఈ వివరాలు వెల్

అమీర్ ముందు తెలుగు హీరోలందరూ బలాదూర్: ఒక్క సినిమాకు 175 కోట్లు
హైదరాబాద్ , సోమవారం, 20 మార్చి 2017 (09:13 IST)
ఒక సినిమా కోసం ‘మిస్టర్ పర్ ఫెక్ట్’ అమీర్ ఖాన్ ఎంత పారితోషికం తీసుకుంటాడో సిల్వర్ స్క్రీన్ పైన తెలియదు గానీ, ఎంతగా కష్టపడతాడో మాత్రం కళ్ళకు కట్టినట్లుగా కనపడుతుంది. మరి అంతలా కష్టపడే ఈ ‘మిస్టర్ పర్ ఫెక్ట్’ ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ ను తీసుకుంటారు అంటే అన్ని సినిమాల సంగతి ఏమో గానీ, తాజాగా అమీర్ నటించి, బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించిన “దంగల్” సినిమాకు సంబంధించిన విషయం మాత్రం బయటకు వచ్చింది.
 
విలక్షణ నటుడు ఆమిర్‌ ఖాన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసులవర్షం కురిపిస్తుంటాయి. బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఎక్కువ అతడివే ఉంటాయి. సినిమా కలెక్షన్ల విషయంలోనే కాదు వ్యక్తిగత రెమ్యునరేషన్ లోనూ 'మిస్టర్ పర్ఫెక్ట్' ముందున్నాడు. ఆమిర్ తాజా చిత్రం 'దంగల్'తో అతడు రూ.175 కోట్లు ఆర్జించినట్టు 'డీఎన్ఏ' పత్రిక వెల్లడించింది. విశ్వసనీయ వర్గాల ద్వారా సంపాదించిన సమాచారం ప్రకారం ఈ వివరాలు వెల్లడించింది.
 
'దంగల్ సినిమా ద్వారా ఆమిర్ ఖాన్ దాదాపు రూ. 175 కోట్లు ఆర్జించాడు. పారితోషికంగా కింద రూ. 35 కోట్లు తీసుకున్నాడు. సినిమా కలెక్షన్లలో 33 శాతం ఆమిర్ తీసుకుంటాడు. అంతకాదు తన సినిమా భవిష్యత్ వసూళ్లలోనూ రాయల్టీ కింద 33 శాతం తీసుకుంటాడ'ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా ఆమిర్‌ ఖాన్ గుర్తింపు పొందాడు. దంగల్ నటి జైరా వసీం ప్రధానపాత్రలో నటించిన 'సీక్రెట్ స్టార్' సినిమాలో ఆమిర్‌ ఖాన్‌ అతిథి పాత్రలో కనిపించనున్నాడు.
 
భవిష్యత్తులో ఈ సినిమా ద్వారా ఎలాంటి ఆదాయం లభించినా కూడా అందులో ఓ 33 శాతం వాటా అమీర్ కు చెందుతుంది గనుక, మ్యాజిక్ ఫిగర్ 200 కోట్లను అమీర్ అందుకోవచ్చని బాలీవుడ్ టాక్. అయితే ఎన్ని కోట్లు అందుకున్నా, ఎంత ఖర్చు పెట్టినా అమీర్ ఖాన్ కున్నంత డెడికేషన్ మరో హీరోకు ఉండదని చెప్పడంలో సందేహం లేదు, మరో మాటకు ఆస్కారం లేదు. కాబట్టి అమీర్ చిత్తశుద్ధి ముందు ఈ కరెన్సీ కట్టలకు విలువ లేదన్నది అసలు నిజం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంత జరిగాక ఇళయరాజాతో ఎలా మాట్లాడాలి: ఎస్పీ బాలు ఆవేదన