బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మరణించినట్లు సోషల్ మీడియా, కొన్ని మీడియా వార్తలలో ప్రచారం మొదలైంది. అయితే, ఆయన కుమార్తె, నటి ఇషా డియోల్ ఈ వార్తలను పూర్తిగా తప్పుడు వార్తలు అని స్పష్టం చేశారు. ఇషా డియోల్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు పెట్టారు.
తండ్రి ధర్మేంద్ర నిలకడగా ఉన్నారు, త్వరగా కోలుకుంటున్నారని ఇషా డియోల్ పేర్కొన్నారు. మీడియా కొన్ని విషయాలను పెద్దగా చూపిస్తూ, తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నట్లు అనిపిస్తుంది.
తన తండ్రి ఆరోగ్యం స్థిరంగా ఉంది, కోలుకుంటున్నారు. మా కుటుంబానికి కొంత ప్రైవసీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తండ్రి త్వరగా కోలుకోవాలని ప్రార్థించినందుకు అందరికీ ధన్యవాదాలు.. అంటూ ఇషా డియోల్ తెలిపారు.