Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను గర్భవతిని కాను, నాకు ఎంగేజ్‌మెంట్ కాలేదు.. నాకు పెళ్ళీ కాలేదు: దీపిక

బాలీవుడ్ పొడవు కాళ్ల సుందరి దీపికా పదుకునే-రణ్ వీర్ సింగ్‌లకు ఎంగేజ్‌మెంట్ అయ్యిందా? ఇప్పటికే ఇరు కుటుంబాల మధ్య పెళ్ళి చర్చలు జరుగుతున్నాయా? అనే ప్రశ్నలకు ట్రిపుల్ ఎక్స్ హీరోయిన్ దీపికా పదుకునే సరైన స

నేను గర్భవతిని కాను, నాకు ఎంగేజ్‌మెంట్ కాలేదు.. నాకు పెళ్ళీ కాలేదు: దీపిక
, గురువారం, 21 జులై 2016 (14:42 IST)
బాలీవుడ్ పొడవు కాళ్ల సుందరి దీపికా పదుకునే-రణ్ వీర్ సింగ్‌లకు ఎంగేజ్‌మెంట్ అయ్యిందా? ఇప్పటికే ఇరు కుటుంబాల మధ్య పెళ్ళి చర్చలు జరుగుతున్నాయా? అనే ప్రశ్నలకు ట్రిపుల్ ఎక్స్ హీరోయిన్ దీపికా పదుకునే సరైన సమాధానం ఇచ్చింది. '' నేను గర్భవతిని కాదు, నాకు ఎంగేజ్‌మెంట్ కాలేదు, నాకు పెళ్ళి కాలేదు.. ఇప్పట్లో పెళ్ళి చేసుకునే ఉద్దేశం కూడా లేదు...!" అని దీపికా తేల్చి చెప్పేసింది. 
 
అసలు విషయం ఏంటంటే.. దీపిక పదుకునే, ఎనర్జిటిక్ హీరో రణ్‌వీర్ సింగ్‌ల ప్రేమ, పెళ్ళి విషయంపై గత కొన్ని రోజులుగా పుకార్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన వస్త్రాలతో జరిగిన ఫ్యాషన్ షోలో దీపికా సరైన సమాధానం ఇచ్చింది. దీనిపై స్పందించిన దీపిక ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని వెల్లడించింది. ఇకపోతే... దీపిక హాలీవుడ్ మూవీ ట్రిపుల్ ఎక్స్ సినిమా టీజర్ రిలీజైంది. ఇందులో అమ్మడు అందాలతో పాటు హాలీవుడ్ హీరోకు ధీటుగా సాహాసాలు చేసింది. మరోవైపు సంజయ్ లీలా భన్సాలీ చిత్రం పద్మావతిని కూడా ఓకే చేసింది. ఈ మూవీ సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్ళనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'కబాలి' పిచ్చి... రిలీజ్‌కి ముందే రూ. 200 కోట్ల క‌లెక్ష‌న్... ద‌టీజ్ క‌బాలి!