Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తనతో డాన్స్‌ కష్టమంటున్న తమన్నా!

తనతో డాన్స్‌ కష్టమంటున్న తమన్నా!
, సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (18:04 IST)
తమన్నా అంటే డాన్స్‌ బాగా చేస్తుందని.. ఇటీవలే బెల్లంకొండ శ్రీనివాస్‌ కితాబిచ్చాడు. స్పీడున్నోడులో ఆమెతో మంచి ఐటంసాగ్‌ చేయించాడు. అయితే ఎంత డాన్సర్‌ అయినా.. మరో డాన్సర్‌తో కలిసి చేయడం కష్టమేమరి. ఇదే అభిప్రాయాన్ని తమన్నా వ్యక్తం చేస్తుంది. ఇటీవలే ప్రభుదేవాతో నటించే ఛాన్స్‌ దొరికింది. ఇది తమిళం, హిందీ, తెలుగు భాషల్లో ఏకంగా రూపొందబోతుంది. దీనికి నిర్మాత ప్రభుదేవానే.
 
దర్శకుడు విజయ్‌ను తీసుకోవాలని నిర్ణయించారు. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ప్రభుదేవాతో కలిసి నటించే ఛాన్స్‌ రావడంతో పొంగిపోతుంది. తనతో కలిసి నటించడం ఒక ఎత్తయితే.. కలిసి డాన్స్‌ చేయడం ఒక ఛాలెంజ్‌గా వుందని పేర్కొంది. కెరీర్‌కు మరో బ్రేక్‌ ఇస్తుందని చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu