Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rana: అవాస్తవ, తప్పుదారి పట్టించే వార్తా కథనాన్ని ఖండించిన డి. సురేష్ బాబు

Advertiesment
Rana - Suresh babu

దేవీ

, శనివారం, 10 జనవరి 2026 (16:13 IST)
Rana - Suresh babu
దగ్గుబాటి కుటుంబం జనవరి 23న కోర్టుకు హాజరు కావాలని ఆదేశం -అనే శీర్షికతో ప్రచురితమైన అవాస్తావ, తప్పుదారి పట్టించే వార్తా కథనాన్ని శ్రీ డి. సురేష్ బాబు తీవ్రంగా ఖండిస్తున్నారు.
 
సదరు వార్త పూర్తిగా అధికారిక న్యాయ రికార్డులకు విరుద్ధంగా, వాస్తవాలను వక్రీకరించి ప్రచురించబడింది. 14-11-2025 తేదీ ఉత్తర్వుల ప్రకారం, గౌరవనీయులైన XVII అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్, హైదరాబాద్ స్పష్టంగా నమోదు చేసినది ఏమనగా— వ్యక్తిగత హాజరు కోసం ఎలాంటి అత్యవసరత లేదని, అలాగే ఈ కేసు పరిస్థుతులు తనపై గానీ, ఇతర అభియుక్తులపై గానీ నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ఈ వ్యవహారాన్ని కేవలం క్రిమినల్ మిసిలేనియస్ పిటిషన్ల పరిష్కారం కోసం 09-01-2026కి వాయిదా వేశారు. 09-01-2026 న కూడా ఈ విషయం కేవలం క్రిమినల్ మిసిలేనియస్ పిటిషన్ల పరిష్కారం కోసమే వాయిదా పడింది గానీ, వ్యక్తిగత హాజరు కోసం కాదు.
 
ఇలాంటి స్పష్టమైన న్యాయపరమైన రికార్డ్స్ ఉన్నప్పటికీ, సదరు ఇంగ్లీష్ దినపత్రిక వాస్తవాలకు విరుద్ధంగా సంచలనాత్మక కథనాన్ని ప్రచురించడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించి, గౌరవానికి  నష్టం కలిగించింది.
 
డి. సురేష్ బాబు న్యాయ ప్రక్రియకు పూర్తి సహకారం అందిస్తూ వచ్చారు, న్యాయవ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నారు. ఈ తప్పుడు ప్రచురణకు బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకోవడానికి ఆయనకు అన్ని చట్టపరమైన హక్కులు ఉన్నాయి.
 
వ్యక్తుల గౌరవానికి తీవ్రమైన ప్రభావం చూపే వార్తలను ప్రచురించే ముందు అధికారిక కోర్టు రికార్డులను పరిశీలించి, బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని పాటించాలని ఆయన మీడియాను కోరుతున్నారు.
 -లీగల్ టీమ్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Prabhas Old getup: రాజాసాబ్ లో ప్రభాస్ ను ఓల్డ్ గెటప్ చూపిస్తున్నాం : మారుతీ