Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాణీ ముఖర్జీ ప్రెగ్నెంట్: కన్ఫామ్ చేసిన జ్యోతి ముఖర్జీ

రాణీ ముఖర్జీ ప్రెగ్నెంట్: కన్ఫామ్ చేసిన జ్యోతి ముఖర్జీ
, మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (14:54 IST)
బాలీవుడ్ అందాల నటి రాణీ ముఖర్జీ గర్భంగా ఉందని ఆమె వదిన జ్యోతి ముఖర్జీ వెల్లడించింది. జనవరి 2016 కొత్త సంవత్సరంలో రాణీ ముఖర్జీ పండంటి బిడ్డకు జన్మనివ్వనుందని జ్యోతి ముఖర్జీ తెలిపింది. కుచ్ కుచ్ హోతా హై సినిమా నటీమణి అయిన రాణీ ముఖర్జీ.. ఆదిత్యా చోప్రాను వివాహమాడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పెళ్లయి పిల్లలున్న నిర్మాత ఆదిత్య చోప్రా, రాణి ముఖర్జీల వివాహం ఇటలీలో సైలెంట్‌గా జరిగిపోయింది. 
 
ప్రస్తుతం రాణీ, చోప్రా లండన్‌లో ఉన్నారు. అమీర్ ఖాన్ హీరోగా వస్తున్న ఈ సినిమాను యశ్ రాజ్ పిక్చర్స్‌పై ఆదిత్యా చోప్రానే నిర్మిస్తున్నాడు. దీంతో అతను కూడా లండన్ లోనే ఉన్నాడు. ప్రస్తుతం కలసి గడపడానికి వారికి చాలా వేల్యుబుల్ టైమ్ దొరికిందని పత్రికలు రాస్తున్నాయి. అమీర్ ఖాన్ గులాం సినిమా ద్వారా రాణీ ముఖర్జీ వెండి తెరకు పరిచయమైంది. 

Share this Story:

Follow Webdunia telugu