Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధనరాజ్‌ ఏమయ్యాడు? రియల్ ఎస్టేట్‌పై కాన్‌సన్‌ట్రేషన్ చేశాడట..

ధనరాజ్ ఏమయ్యాడు? అనేదే ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. ఒకవైపు దర్శకత్వం, మరోవైపు నిర్మాణం చేపడితే పరిస్థితి ఇంతే. ఆర్టిస్టు ఆర్టిస్టుగానే వుండాలి. ఇది సినిమా చరిత్రలో ఎందరికో నేర్పిన పాఠం.

ధనరాజ్‌ ఏమయ్యాడు? రియల్ ఎస్టేట్‌పై కాన్‌సన్‌ట్రేషన్ చేశాడట..
, శుక్రవారం, 11 నవంబరు 2016 (12:16 IST)
ధనరాజ్ ఏమయ్యాడు? అనేదే ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. ఒకవైపు దర్శకత్వం, మరోవైపు నిర్మాణం చేపడితే పరిస్థితి ఇంతే. ఆర్టిస్టు ఆర్టిస్టుగానే వుండాలి. ఇది సినిమా చరిత్రలో ఎందరికో నేర్పిన పాఠం. కానీ. కమేడియన్‌ ధనరాజ్‌.. తను షూటింగ్‌లో చేస్తున్న ఓవర్‌యాక్షన్‌ వల్ల సినిమాలు పోగొట్టుకుంటున్నాడు. ఇటీవలే ఆయన చేసిన పనిలేని పులిరాజు.. 12పాత్రలు పోషించాడు. అవి అస్సలు అవసరమా? అనేది సినిమా చూశాక తెలిసింది. 
 
లేనిపోని బిల్డప్‌లు చేసి.. తీసిన ఆ సినిమాను దర్శకుడు చాచాతో ప్రమేయం లేకుకండా తనే చేసేయడం జరిగింది. ఇలా కొత్త దర్శకులతో ఆయన ఆడుకుంటుంటాడు. ఈ నేపథ్యంలో ధనరాజ్ అంటేనే దర్శకులు భయపడిపోతున్నారు. కొత్తగా వస్తున్న జబర్‌దస్త్ బ్యాచ్‌ అందుబాటులో వుండడంతో.. ధనరాజ్‌కు ఇచ్చే రెమ్యునరేషన్‌తో నలుగురు ఆర్టిస్టులు రావడంతో.. ఇదే సేఫ్‌గా మారింది దర్శక నిర్మాతలకు. ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌పై కాన్‌సన్‌ట్రేషన్ చేశాడని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టార్ వ్యభిచారమణులకు నల్లధనం చిక్కులు.. ఇకపై చెల్లింపులు ఎలా?