Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'తాగుబోతు' రమేష్‌ను సరిగ్గా ఇండస్ట్రీలో ఉపయోగించుకోవట్లేదు: హాస్య నటుడు పృథ్వీ

తాగుబోతు రమేష్‌లో చాలా ప్రతిభ దాగివుందనీ, కానీ చిత్ర పరిశ్రమే అతన్ని సరిగా వినియోగించుకోవడం లేదని హాస్య నటుడు పృథ్వీ అన్నారు. ఆయన ఓ ప్రైవేట్ న్యూస్ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయ

'తాగుబోతు' రమేష్‌ను సరిగ్గా ఇండస్ట్రీలో ఉపయోగించుకోవట్లేదు: హాస్య నటుడు పృథ్వీ
, ఆదివారం, 30 అక్టోబరు 2016 (14:37 IST)
తాగుబోతు రమేష్‌లో చాలా ప్రతిభ దాగివుందనీ, కానీ చిత్ర పరిశ్రమే అతన్ని సరిగా వినియోగించుకోవడం లేదని హాస్య నటుడు పృథ్వీ అన్నారు. ఆయన ఓ ప్రైవేట్ న్యూస్ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అరకిలో బియ్యం వండుకుని తినడం దగ్గర నుంచి, రెండు వేల రూపాయల లంచ్ చేసే వరకు నటుడు తాగుబోతు రమేష్, తాను కలిసే ఉన్నామని గుర్తు చేశారు. 
 
నిజానికి 'తాగుబోతు రమేష్ కూడా ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అయింది. మేమిద్దరం కలిసి చాలా రోజులు ఉన్నాం. ఇంతమంది కమెడియన్స్ ఉన్నా కూడా, తాగుబోతు రమేష్ వేరియషన్ వేరు. ఇంకా అతనితో ‘మందు’ డైలాగులే చెప్పిస్తున్నారు కానీ, అతన్ని సరిగ్గా ఇండస్ట్రీలో ఉపయోగించుకోవట్లేదు' అని వ్యాఖ్యానించారు. 
 
ఈ సందర్భంగా దీపావళి పండగ గురించి మాట్లాడుతూ, తాను బిజీ కాకముందే పండగ బాగా జరుపుకునేవాడినని, చుట్టాలు, బంధువులు, అందరు కలుస్తుండేవారని, షూటింగ్ ఉన్నా కూడా మధ్యలో ఇంటికెళ్లి శుభ్రంగా భోజనం చేసి వెళ్లిపోయేవాడినని, ఈ బిజీ జీవితంలో అన్నీ మిస్సయిపోతున్నామని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రజినీకాంత్... అల్లుడు - మనువడితో కలిసి దీపావళి