Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెజీనా జపం చేస్తున్న చిరంజీవి: 150 సినిమాలో హీరోయిన్ ఛాన్స్?!

రెజీనా జపం చేస్తున్న చిరంజీవి: 150 సినిమాలో హీరోయిన్ ఛాన్స్?!
, సోమవారం, 5 అక్టోబరు 2015 (12:27 IST)
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో ''గువ్వా గోరింకతో'' రీమిక్స్ సాంగ్‌లో రెజీనా వేసిన స్టెప్స్ మెగాస్టార్ చిరంజీవిని బాగా ఆకట్టుకున్నాయి. రెజీనా, సాయిధరమ్ తేజ్‌లు నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సినిమాలో రెజీనా నటనకు కూడా చిరంజీవి మంచి మార్కులు వేశారు.

ఈ నేపథ్యంలో చిరంజీవి తన 150వ సినిమాలో రెజీనాకు హీరోయిన్ ఛాన్స్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ డేట్స్ దొరకడం కష్టంగా ఉన్న నేపథ్యంలో రెజీనా అయితే చిరంజీవి డేట్స్‌తో సహకరిస్తూ ఎన్ని బల్క్ డేట్స్ కావాలన్నా ఇస్తుందనే ఉద్దేశంతోనే చిరంజీవి నోటివెంట రెజీనా ప్రస్తావన వచ్చిందని టాక్ వస్తోంది. 
 
కాగా, చిరంజీవి తన 150వ సినిమాగా ‘కత్తి’ రీమేక్‌కు పచ్చ జండా ఊపడంతో ఈ సినిమా అధికారిక ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రీమేక్‌లో హీరోయిన్ ఎంపిక విషయమై మెగా కాంపౌండ్‌లో ఈమధ్య జరిగిన చర్చలలో రెజీనా ప్రస్తావన వచ్చినట్లుగా ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
అయితే కేవలం ఇది సంభాషణలో వచ్చిన ప్రస్తావనే అయినా ఇటువంటి ప్రస్తావనలో రెజీనా పేరు రావడం ప్రస్తుతం ఆమె క్రేజ్‌కు నిదర్శనం అని అంటున్నారు. ఇప్పటికే మెగా హీరోయిన్‌గా ముద్ర వేయిoచుకున్న రెజీనా నిజంగానే ఇటువంటి అదృష్టాన్ని పొందగలిగితే రెజీనా టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోవడం ఖాయమని సినీ పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu