Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''కత్తిలాంటోడు'' ఆ రికార్డును సృష్టిస్తాడా?: చెర్రీ-సుస్మిత-సురేఖ-శ్రీజ ఒక్కటైతే..?!

మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా కోసం ముఖానికి రంగేసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ ఫోటోలు సోషల్ మీడియాతో పాటు టాలీవుడ్‌‍ను షేక్ చేస్తున్నాయి. అన్నయ్య సినిమా కోసం ఫ్యాన్స్ వేయికనులతో వేచిచూస

''కత్తిలాంటోడు'' ఆ రికార్డును సృష్టిస్తాడా?: చెర్రీ-సుస్మిత-సురేఖ-శ్రీజ ఒక్కటైతే..?!
, సోమవారం, 27 జూన్ 2016 (17:01 IST)
మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా కోసం ముఖానికి రంగేసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ ఫోటోలు సోషల్ మీడియాతో పాటు టాలీవుడ్‌‍ను షేక్ చేస్తున్నాయి. అన్నయ్య సినిమా కోసం ఫ్యాన్స్ వేయికనులతో వేచిచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో చిరంజీవి 150 సినిమా కోసం ఇప్పటికే మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాత అవతారం ఎత్తిన నేపథ్యంలో.. తాజాగా అన్నయ్య చిన్నకూతురు కూడా సినీ ఇండస్ట్రీలో తన ట్యాలెంట్‌ను నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
 
చిరంజీవి పెద్ద తనయ సుస్మితకు ఇప్పటికే జై చిరంజీవ, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఇక సుస్మిత కత్తిలాంటోడుకు కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేయనుండగా, శ్రీజ మాత్రం ప్రొడక్షన్ వైపు మొగ్గుచూపుతుంది.

అన్నీ కుదిరితే చిరంజీవి 150వ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా, సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌గా, చిరు సతీమణి సురేఖ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఇక శ్రీజ కూడా ప్రొడక్షన్ విభాగం వైపు అడుగులేస్తే ఫ్యామిలీ మొత్తం ఒకే సినిమా కోసం పనిచేసిన వారిగా సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయమని సినీ పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"బ్రాహ్మణ" చిత్రానికి మణిశర్మ సంగీతం అద్భుతం : దర్శకరత్న దాసరి